కేంద్రం రైతుల వ్యతిరేకి

KCR Clarified Farmers Should Plant Alternative Crops Instead Of Paddy In Yasangi - Sakshi

భారీ వరిసాగును అపహాస్యం చేసేలా మాట్లాడుతోంది: కేసీఆర్‌

సాక్షి, హైదరాబాద్‌:  కేంద్ర ప్రభుత్వం బాయిల్డ్‌ రైస్‌ (ఉప్పుడు బియ్యం) కొనబోమని తేల్చిచెప్పినందున రైతులు యాసంగిలో వరికి బదులు ప్రత్యామ్నాయ పంటలు వేసుకోవాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ స్పష్టం చేశారు. కేంద్రం కొంటానంటే తానే దగ్గరుండి మరీ రైతులు వరి రైతులకు సాయం చేస్తానని చెప్పారు. కానీ, రాజ్యాంగబద్ధంగా సంక్రమించిన బాధ్యతలను కేంద్రం విస్మ రిస్తోం దని, రైతుల వ్యతిరేకిగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. ఆదివారం మీడియాతో మాట్లాడు తూ సీఎం కేసీఆర్‌ చేసిన వ్యాఖ్యలు ఆయన మాటల్లోనే.. 

రైతులు నష్టపోవద్దు
‘‘ధాన్యం కొనుగోళ్లలో కేంద్రం వింతగా వ్యవహరిస్తోంది. కాలికేస్తే మెడకు.. మెడకేస్తే కాలికి అన్నట్టు గందరగోళం సృష్టిస్తోంది. యాసంగిలో వచ్చే బా యిల్డ్‌ రైస్‌ను కొనబోమని చెప్తోంది. పంట మార్పిడి చేసుకోవాలని కేంద్రం గతంలోనే చెప్పింది. భవిష్యత్తులో బాయిల్డ్‌ రైస్‌ ఇవ్వబోమని లిఖితపూర్వకంగా చెప్తే తప్ప ధాన్యం సేకరించనంటోంది. ఈ విష యాన్ని దృష్టిలో ఉంచుకుని రైతులు ప్రత్యామ్నాయ పంటలు వేసుకోవాలి. మంత్రి నిరంజన్‌రెడ్డి ఇదే విషయాన్ని రైతుల దృష్టికి తెచ్చే ఉద్దేశంతో మాట్లాడారు.

రైతులు దీన్ని విస్మరించి భారీగా వరి వేస్తే ఇ బ్బందే. ధాన్యాన్ని సేకరించి, నిల్వ చేసుకునే స్థాయి లో గోదాములు రాష్ట్ర ప్రభుత్వం ఆధీనంలో ఉండ వు. విదేశాలకు ఎగుమతి చేసే హక్కు రాష్ట్ర ప్రభుత్వానికి ఉండదు. దీనివల్ల ఇబ్బందులు ఎదురై రైతులు నష్టపోయే పరిస్థితి ఉత్పన్నమవుతుంది. ను వ్వులు, పెసర్లు వంటివాటితో వరి కంటే ఎక్కువ లాభం వస్తుంది. వాటిని రెండో పంటగా వేసుకోవ చ్చు. రైతులు నష్టపోవద్దనే ఈ సూచన చేస్తున్నాం. 

కేంద్రం తీరు దారుణం
గతంలో ధాన్యం కొనుగోలుకు ఎఫ్‌సీఐ ముందుకొచ్చినా.. కేంద్రం మోకాలు అడ్డం పెట్టింది. ధాన్యం కొనుగోలులో కేంద్రం తీరు దారుణంగా ఉంది. గతంలో నేను ఢిల్లీ వెళ్లి కేంద్ర వ్యవసాయ మంత్రిని, సంబంధిత అధికారులను కలిసి.. ధాన్యం కొనుగోలు విషయంలో స్పష్టత ఇవ్వాలని కోరినా  స్పం దించలేదు. మూడు నెలలు గడుస్తున్నా కేంద్ర మం త్రి నుంచి సరైన వివరణ రాలేదు. 3 రోజుల క్రితం అధికారులు ఢిల్లీకి వెళ్లినా అదే తీరు.

నేను ఇటీవల కేంద్రమంత్రికి ఫోన్‌ చేస్తే.. ఆయన విదేశాల్లో ఉన్నందున చెప్పలేకపోతున్నానని, త్వరలో స్పష్టత ఇస్తానన్నారు. కానీ, మాట నిలబెట్టుకోలేదు. భవి ష్యత్తులో బాయిల్డ్‌ రైస్‌ ఇవ్వబోమని లిఖితపూర్వ కంగా రాసిఇవ్వాలని గతంలో అడిగారు. కానీ ఈసారి ఎంత ధాన్యం కొనేది ఇప్పటికీ చెప్పకపోవటం దారుణం. ఖరీఫ్‌ రా రైస్‌ కూడా పూర్తిగా తీసుకోలేదు. కేంద్రం మనం అడిగిన దానికి స్పష్టత ఇవ్వకపోగా, రాష్ట్రంలో 62 లక్షల ఎకరాల వరిసాగు అంశాన్ని అపహాస్యం చేసేలా మాట్లాడుతోంది.

శాటిలైట్‌ ఇమేజ్‌లలో అంత సాగు ఉన్నట్టు కనిపిం చటం లేదని అంటోంది. అంటే మేం అబద్ధం చెప్తున్నామా? రాష్ట్రంలో ఎంతమేర వరి సాగవుతుందో  లెక్కలు ఉన్నాయి. ముందు నుంచీ కూడా కేంద్రం రైతు వ్యతిరేకిగానే వ్యవహరిస్తోంది.

రైతుల సంక్షేమమే లక్ష్యం
ఏడేళ్ల నుంచి నిద్రలేకుండా రైతుల సంక్షేమం కోసం పనిచేస్తున్నాం. రాష్ట్రం ఏర్పాటైన సమయంలో రైతుల ఆత్మహత్యలతో కకావికలమైన పరిస్థితి ఉండేది. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం వచ్చాక స్థిరమైన లక్ష్యంతో గ్రామీణ ఆర్థిక వ్యవస్థను పరిపుష్టం చేస్తూ వచ్చింది. భూగర్భ జలాలను పెంచేందుకు చెరువులను తీర్చిదిద్దాం. 24 గం టల విద్యుత్‌ను అందిస్తున్నాం. ప్రపంచంలో ఎక్కడా లేనట్టు రైతుబంధు ద్వారా ఎకరాకు రూ.10 వేలు ఇస్తున్నాం.

చిన్నసన్నకారు రైతులు చనిపోతే ఆ కుటుంబాలను ఆదుకునేందుకు రైతు బీమా ప్రారంభించాం. కల్తీ విత్తనాల బాధ, ఎరువుల కొరత లేకుండా చేశాం. ఫలితంగా అద్భుతంగా వ్యవసాయ స్థిరీకరణ జరిగింది. కరోనా కాలంలో మొత్తం ధాన్యాన్ని కొన్న ఏకైక రాష్ట్రం మనదే. ఇప్పటికైనా కేంద్రం మొత్తం ధాన్యాన్ని కొంటానంటే దగ్గరుండి వరి సాగు చేయించేందుకు సిద్ధం. కానీ, అది యాసంగి ధాన్యం కొనబోమంటోంది.

రైతులు ప్రత్యా మ్నాయ పంటలు వేసుకోవాల్సిందే’’ అని కేసీఆర్‌ పేర్కొన్నారు. ధాన్యం కొనలేమంటూ కేంద్ర ప్రభుత్వం, ఎఫ్‌సీఐల నుంచి అందిన లిఖితపూర్వక వివరాలను మీడియాకు అందజేశారు. అయితే డిసెంబర్‌ వరకు నాట్లు వేసుకునే వెసులుబాటు ఉన్నందున.. ఆలోగా కేంద్రం ఏమైనా స్పందిస్తుందేమో చూస్తామని, రైతులు మాత్రం ప్రత్యామ్నాయ పంటలకు సిద్ధంగా ఉండాలని సూచించారు.   

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top