‘మొలంగూరు’ వారి ఆహ్వాన పత్రిక | karimnagar molangur villagers invite collector over issues | Sakshi
Sakshi News home page

‘మొలంగూరు’ వారి ఆహ్వాన పత్రిక

Mar 26 2026 12:39 PM | Updated on Mar 26 2026 1:09 PM

karimnagar molangur villagers invite collector over issues

విద్యానగర్‌(కరీంనగర్‌)/శంకరపట్నం: ‘మొలంగూరు వారి ఆహ్వాన పత్రిక. శ్రీమతి, శ్రీ చిత్రా మిశ్రా ఐఏఎస్‌ గారు, కలెక్టర్‌ కార్యాలయం, కరీంనగర్‌ జిల్లా. ఆహ్వానించువారు మొలంగూరు గ్రామ ప్రజలు, మండలం శంకరపట్నం, జిల్లా కరీంనగర్‌’.. అంటూ అచ్చు పెళ్లి పత్రి కలా రూపొందించిన ఆహ్వాన పత్రికను మొలంగూరు గ్రామ ప్రజలు కలెక్టర్‌ చిత్రా మిశ్రాకు అందజేశారు. 

తమ సమస్యల పరిశీలనకు ఓసారి గ్రామానికి రావాలని కోరారు. చరిత్రాత్మ కమైన మొలంగూర్‌ ఖిల్లాను పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయాలని, ఖిల్లాకు వెళ్లేదారిలో ఉన్న మిద్దె గోడలు, రెండు ఎకరాల 10 గుంటల భూమి అక్రమణలకు గురైందని పేర్కొన్నారు. ఈ స్థలాన్ని కాపాడి, ప్రభుత్వ కార్యాలయాలు, సోలార్‌ ప్లాంట్, పార్క్, గ్రంథాలయం ఏర్పాటు చేయాలని కోరారు. ఆహ్వాన పత్రికను అందజేసిన వారిలో తెలంగాణ జన సమితి పార్టీ జిల్లా అధ్యక్షుడు మోరె గణేశ్, జిల్లా అధికార ప్రతినిధి చిట్యాల భానుబాబు ఉన్నారు.  

Advertisement
 
Advertisement
Advertisement