కాళేశ్వరం కమిషన్‌ విచారణ గడువు పొడిగింపు | Kaleshwaram Commission Inquiry Deadline Extension | Sakshi
Sakshi News home page

కాళేశ్వరం కమిషన్‌ విచారణ గడువు పొడిగింపు

Jun 29 2024 2:37 PM | Updated on Jun 29 2024 3:15 PM

Kaleshwaram Commission Inquiry Deadline Extension

కాళేశ్వరం కమిషన్ విచారణ గడువును తెలంగాణ ప్రభుత్వం పెంచింది.

సాక్షి, హైదరాబాద్‌: కాళేశ్వరం కమిషన్ విచారణ గడువును తెలంగాణ ప్రభుత్వం పెంచింది. రెండు నెలల పాటు గడువును పెంచుతూ ఇరిగేషన్ సెక్రెటరీ రాహుల్ బొజ్జ ఉత్తర్వులు జారీ చేశారు. రేపటితో గడువు ముగియడంతో ఆగస్టు 31వ తేదీ వరకు కాళేశ్వరం కమిషన్ గడువును పెంచుతూ ఉత్తర్వులు ఇచ్చారు.

మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలపై విచారణకు సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్‌ పీసీ ఘోష్‌ నేతృత్వంలో ప్రభుత్వం కమిషన్‌ ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. కమిషన్‌ ముందు విచారణకు హాజరైన మాజీ ఈఎన్సీలు, ప్రస్తుత ఈఎన్సీలు, సీఈలు, ఇతర ఇంజినీర్లు, నిర్మాణ సంస్థల ప్రతినిధులను పూర్తి వివరాలతో అఫిడవిట్లు దాఖలు చేయాలని ఈ నెలలో నిర్వహించిన విచారణ సందర్భంగా జస్టిస్‌ పీసీ ఘోష్‌ ఆదేశించారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement