K8 Tiger: కవ్వాల్‌.. పులి కమాల్‌!

K8 Tiger Spotted At Kawal Tiger Reserve Forest Mancherial - Sakshi

సాక్షి, మంచిర్యాల: కవ్వాల్‌ టైగర్‌ రిజర్వులో పులుల జీవన చిత్రానికి చక్కటి ఉదాహరణ ఈ ఫొటో. మహారాష్ట్రలోని తడోబా, తిప్పేశ్వర్‌ పులుల అభయారణ్యాల నుంచి వలస పులుల రాకతో కవ్వాల్‌లో పులుల సంతతి పెరుగుతోంది. 2015లో పాల్గుణ అనే పులి అడుగు పెట్టి.. రెండు దశల్లో నాలుగు చొప్పున ఎనిమిదింటికి జన్మనివ్వడంతో ఒక్కసారిగా వాటి జనాభా పెరిగింది.

వీటితోపాటు మరికొన్ని కొత్త పులులు అడవుల్లో సందడి చేస్తున్నాయి. ఈ ఫొటోలో కనిపిస్తున్నది (కే8) అనే నాలుగేళ్ల ఆడ పులి. ఇది రెండు పిల్లల తల్లి. ఇటీవల అడవిలో నీటి ప్రవాహంపై దూకుతుండగా కెమెరాకు చిక్కింది. అటవీ అధికారుల సంరక్షణ చర్యలతో భవిష్యత్‌లో మరిన్ని పులులకు కవ్వాల్‌ ఆవాసంగా మారబోతోంది.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top