breaking news
K8
-
కవ్వాల్.. పులి కమాల్!
సాక్షి, మంచిర్యాల: కవ్వాల్ టైగర్ రిజర్వులో పులుల జీవన చిత్రానికి చక్కటి ఉదాహరణ ఈ ఫొటో. మహారాష్ట్రలోని తడోబా, తిప్పేశ్వర్ పులుల అభయారణ్యాల నుంచి వలస పులుల రాకతో కవ్వాల్‌లో పులుల సంతతి పెరుగుతోంది. 2015లో పాల్గుణ అనే పులి అడుగు పెట్టి.. రెండు దశల్లో నాలుగు చొప్పున ఎనిమిదింటికి జన్మనివ్వడంతో ఒక్కసారిగా వాటి జనాభా పెరిగింది. వీటితోపాటు మరికొన్ని కొత్త పులులు అడవుల్లో సందడి చేస్తున్నాయి. ఈ ఫొటోలో కనిపిస్తున్నది (కే8) అనే నాలుగేళ్ల ఆడ పులి. ఇది రెండు పిల్లల తల్లి. ఇటీవల అడవిలో నీటి ప్రవాహంపై దూకుతుండగా కెమెరాకు చిక్కింది. అటవీ అధికారుల సంరక్షణ చర్యలతో భవిష్యత్‌లో మరిన్ని పులులకు కవ్వాల్ ఆవాసంగా మారబోతోంది. -
ఎల్జీ పాంచ్ పటాకా: ఐదు స్మార్ట్ఫోన్లు లాంచ్
లాస్వేగాస్లో ప్రారంభంకాబోతున్న సీఈఎస్ 2017 ట్రేడ్ షోకు ముందుస్తుగా ఎల్జీ ఐదు కొత్త స్మార్ట్ఫోన్లను లాంచ్ చేసింది. వాటిలో నాలుగు కే-సిరీస్ స్మార్ట్ఫోన్లు కాగ, ఒకటి స్టైలస్ స్మార్ట్‌ఫోన్. 2017 తమ కొత్త వేరియంట్లు ఎల్జీ కే3, ఎల్జీ కే4, ఎల్జీ కే8, ఎల్జీ కే10, స్టైలస్ 3గా ఈ దక్షిణ కొరియా దిగ్గజం పేర్కొంది. స్టైలస్ 3 స్మార్ట్‌ఫోన్ తమ మిడ్-రేంజ్ సెగ్మెంట్ పోర్ట్‌ఫోలియోను మరింత పటిష్టపరుస్తుందని తెలిపింది. ఈ కొత్త ఎల్జీ స్మార్ట్ఫోన్లను సీఈఎస్ 2017 ఈవెంట్లో ప్రదర్శించబోతున్నట్టు కూడా వెల్లడించింది. ఎల్జీ కే3(2017) ఫీచర్లు... 4.50 అంగుళాల డిస్ప్లే 1.1 గిగాహెడ్జ్ క్వాడ్-కోర్ ప్రాసెసర్ 480x854 పిక్సెల్స్ రెజుల్యూషన్ ఆండ్రాయిడ్ 6.0 ఓఎస్ 1జీబీ ర్యామ్ 8జీబీ స్టోరేజ్ 2 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా 5 మెగాపిక్సెల్ రియర్ కెమెరా 2100 ఎంఏహెచ్ బ్యాటరీ ఎల్జీ కే4(2017) ఫీచర్స్... 5.00 అంగుళాల డిస్ప్లే 1.1 గిగాహెడ్జ్ క్వాడ్-కోర్ ప్రాసెసర్ 480x854 పిక్సెల్స్ రెజుల్యూషన్ ఆండ్రాయిడ్ 6.0 ఓఎస్ 1జీబీ ర్యామ్ 8జీబీ స్టోరేజ్ 5 ఎంపీ ఫ్రంట్ కెమెరా 5 ఎంపీ రియర్ కెమెరా 2500 ఎంఏహెచ్ బ్యాటరీ ఎల్జీ కే8(2017) ఫీచర్స్.. 5.00 అంగుళాల డిస్ప్లే 1.4 గిగాహెడ్జ్ క్వాడ్-కోర్ ప్రాసెసర్ 720x1280 పిక్సెల్స్ రెజుల్యూషన్ 1.5 జీబీ ర్యామ్ 16 జీబీ స్టోరేజ్ 5 ఎంపీ ఫ్రంట్ కెమెరా 13 ఎంపీ రియర్ కెమెరా ఆండ్రాయిడ్ 7.0 ఓఎస్ 2500 ఎంఏహెచ్ బ్యాటరీ ఎల్జీ కే10(2017) ఫీచర్స్.. 5.30 అంగుళాల డిస్ప్లే 1.5 గిగాహెడ్జ్ క్వాడ్-కోర్ ప్రాసెసర్ 720x1280 పిక్సెల్స్ రెజుల్యూషన్ 2జీబీ ర్యామ్ 16జీబీ స్టోరేజ్ 5 ఎంపీ ఫ్రంట్ కెమెరా 13 ఎంపీ రియర్ కెమెరా ఆండ్రాయిడ్ 7.0 ఓఎస్ 2800 ఎంఏహెచ్ బ్యాటరీ ఎల్జీ స్టైలస్ 3 ఫీచర్స్... 5.70 అంగుళాల డిస్ప్లే 1.5 గిగాహెడ్జ్ ఆక్టా-కోర్ ప్రాసెసర్ 720x1280 పిక్సెల్స్ రెజుల్యూషన్ 3 జీబీ ర్యామ్ 16 జీబీ స్టోరేజ్ 8 ఎంపీ ఫ్రంట్ కెమెరా 13 ఎంపీ రియర్ కెమెరా ఆండ్రాయిడ్ 7.0 ఓఎస్ 3200 ఎంఏహెచ్ బ్యాటరీ