ప్రియుడికి బర్త్‌ డే గిఫ్ట్‌ ఇచ్చేందుకు.. | Jubliee Hills Watch Theft Woman Steals Gift For Boyfriend | Sakshi
Sakshi News home page

ప్రియుడికి బర్త్‌ డే గిఫ్ట్‌ ఇచ్చేందుకు..

Apr 15 2026 8:14 AM | Updated on Apr 15 2026 8:14 AM

Jubliee Hills Watch Theft Woman Steals Gift For Boyfriend

హైదరాబాద్: ప్రియుడికి బర్త్‌డే గిఫ్ట్‌ ఇచ్చేందుకు చోరీ బాట పట్టింది ఓ ప్రియురాలు. సీసీ ఫుటేజీకి చిక్కి అరెస్టయింది. ఈ ఘటన జూబ్లీహిల్స్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. ఖమ్మం జిల్లాకు చెందిన యువతి (26) బీటెక్‌ చదివింది. నగరానికి వచ్చి ఓ ప్రైవేటు సంస్థలో పని చేస్తూ హాస్టల్‌లో ఉంటోంది. ఇదే జిల్లాకు చెందిన ప్రైవేటు ఉద్యోగి కొత్త మురళీధర్‌గౌడ్‌ (29)తో కొంతకాలంగా ప్రేమలో ఉంది. 

మూడు రోజుల క్రితం ప్రియుడి బర్త్‌డేకు ఖరీదైన గిఫ్ట్‌ ఇచ్చేందుకు మురళీధర్‌ గౌడ్‌ కారులో జూబ్లీహిల్స్‌ రోడ్డునెంబర్‌–36లోని రమేష్‌ వాచ్‌ కంపెనీకి వచి్చంది. మురళీధర్‌ను కారులోనే కూర్చోమని షోరూంలోకి వెళ్లింది. వాచీలను చూపించాలని సేల్స్‌మన్‌ను అటూ ఇటూ తిప్పుతూ అప్పటికే అక్కడ ఉంచిన ఒక్కొక్కటి రూ.లక్ష ఖరీదు చేసే రెండు టిస్సాట్‌ వాచీలను చాకచాక్యంగా బ్యాగ్‌లో వేసుకుంది. వాచీలు నచ్చలేదంటూ బయటకు వెళ్లిపోయింది.

 కొద్దిసేపటి తర్వాత సేల్స్‌మన్‌ గమనించగా అక్కడ  రెండు వాచీలు కనిపించలేదు. పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు సీసీ ఫుటేజీలను పరిశీలించగా యువతి రెండు వాచీలను హ్యాండ్‌బ్యాగ్‌లో వేసుకున్నట్లు కనిపించింది. కారు నంబర్‌ ఆధారంగా పోలీసులు ఖమ్మంలో యువతిని అరెస్టు చేశారు. యువతి దొంగతనంతో ప్రియుడిపైనా కేసు నమోదైంది. ఇద్దరినీ అరెస్టు చేశారు.    

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement