‘జనాభాకు అనుగుణంగా పాఠశాలలు పెంచాలి’  | Jajula Srinivas Goud Comments On Public Schools | Sakshi
Sakshi News home page

‘జనాభాకు అనుగుణంగా పాఠశాలలు పెంచాలి’ 

Jan 19 2022 5:02 AM | Updated on Jan 19 2022 5:02 AM

Jajula Srinivas Goud Comments On Public Schools - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా ప్రభుత్వ పాఠశాలలు పెంచాలని, ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశపెట్టాలని ముందు నుంచి ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేస్తున్నామని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్‌ తెలిపారు.

ప్రభుత్వ, ఎయిడెడ్‌ పాఠశాలల్లో వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఇంగ్లిష్‌ మాధ్యమాన్ని తెచ్చే ప్రతిపాదనను స్వాగతిస్తున్నామని మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కోట్లు ఖర్చు చేస్తున్నామని చెబుతున్నా ప్రభుత్వ పాఠశాలల్లో కనీస సౌకర్యాల్లేవని, ఇప్పటికే అనేక పాఠశాలలు అద్దె భవనాల్లో ఉన్నాయని విమర్శించారు.గురుకులాలకు భవనాల నిర్మాణం చేపట్టాలని డిమాండ్‌ చేశారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement