ఆర్మీ ఉద్యోగార్థుల పోరాటంలో న్యాయముంది | Jagga Reddy Comments On Secunderabad Railway Station Army Protest | Sakshi
Sakshi News home page

ఆర్మీ ఉద్యోగార్థుల పోరాటంలో న్యాయముంది

Jun 18 2022 2:04 AM | Updated on Jun 18 2022 2:04 AM

Jagga Reddy Comments On Secunderabad Railway Station Army Protest - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌లో ఆర్మీ ఉద్యోగార్థుల పోరాటంలో న్యాయం ఉందని సంగారెడ్డి ఎమ్మెల్యే టి.జగ్గారెడ్డి అభిప్రాయపడ్డారు. కేసులు పెట్టి వారి బంగారు భవిష్య త్‌ను నాశనం చేయొద్దని రైల్వేశాఖకు విజ్ఞప్తి చేశారు. బీజేపీ ప్రభుత్వం తీసుకున్న అనాలోచిత నిర్ణయమే యువకుల కోపానికి కారణమైందని, తప్పుడు విధానాలతో యువకుల భవి ష్యత్తును అదానీ, అంబానీలకు అమ్మివేయొద్దంటూ శుక్ర వారం ఒక ప్రకటన విడుదల చేశారు.

రాజకీయ పార్టీల మద్దతు తీసుకోకుండా ఉద్యోగాల కోసం రాష్ట్ర రాజధానిలో ఇంత పెద్ద ఉద్యమం జరగడం ఇదే తొలిసారన్నారు.  కేంద్రంతో మాట్లాడి సమస్యను పరిష్కరిం చా ల్సిన బీజేపీ నేతలు బాధ్యతారాహిత్యంగా మాట్లాడారని మండిపడ్డారు. కిషన్‌రెడ్డి చేతులెత్తేస్తే, బండి సంజయ్‌ పెద్ద పెద్ద మాటలు నరికాడని ఎద్దేవా చేశారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement