
సాక్షి, హైదరాబాద్: యాక్సిస్ ఎనర్జీ సంస్థకు భారీ షాక్ తగిలింది. విండ్ పర్‌లో పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టారన్న ఆరోపణలతో ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఐటీ అధికారులు గురువారం దాడులు నిర్వహిస్తున్నారు. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో యాక్సెస్ ఎనర్జీ కంపెనీ గ్రూప్ సంస్థలపై 20 చోట్ల ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా పలు కీలక పత్రాలను అధికారులు స్వాధీనం చేసుకున్నట్టు సమాచారం.