 
													సాక్షి,హైదరాబాద్: తెలంగాణలో ఎనిమిదిమంది ఐఏఎస్‌లు బదిలీ అయ్యారు. ఈమేరకు ఎనిమిది మంది ఐఏఎస్ అధికారుల్ని బదిలీ చేస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు.
- పశుసంవర్ధక, పాడి పరిశ్రమ, అభివృద్ధి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఉన్న సబ్యసాచి ఘోష్.. ఇప్పుడు అభివృద్ధి, సంక్షేమ పథకాల స్పెషల్ ప్రిన్సిపల్ సెక్రటరీగా బదిలీ అయ్యారు.. ఈయనే వెల్ఫేర్ విభాగం ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా కూడా కొనసాగుతారు. 
- మహిళా, శిశు సంక్షేమ శాఖ కార్యదర్శిగా ఉన్న అనితా రామచంద్రన్.. వెల్ఫేర్ విభాగం కార్యదర్శి, గిరిజన సంక్షేమ కమిషనర్‌గా బదిలీ అయ్యారు. 
- మెట్రోపాలిటన్ ఏరియా, అర్బన్ డెవలప్మెంట్ శాఖ కార్యదర్శిగా ఉన్న ఇలంబర్తి.. ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్‌గా ప్రభుత్వం నియమించింది. 
- బీసీ వెల్ఫేర్ శాఖ కార్యదర్శిగా ఉన్న శ్రీధర్.. జీడీఏ పొలిటికల్ శాఖ కార్యదర్శిగా బాధ్యతలు అప్పగించింది. 
- హార్టికల్చర్ & సిరికల్చర్ డైరెక్టర్‌గా ఉన్న షేక్ యస్మీన్ బాషా.. ఆయిల్ ఫెడ్ మేనేజింగ్ డైరెక్టర్‌గా బాధ్యతలు నిర్వర్తించనున్నారు. 
- మెట్రోపాలిటన్ ఏరియా & అర్బన్ డెవలప్మెంట్ శాఖ కార్యదర్శిగా రామకృష్ణ రావు కొనసాగుతారు 
- జితేందర్ రెడ్డి ఎస్సీ డెవలప్‌మెంట్ స్పెషల్ కమిషనర్‌గా బదిలీ అయ్యారు. 
- మహాత్మా జ్యోతిబా ఫూలే బీసీ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ సొసైటీ కార్యదర్శిగా ఉన్న సైదులు.. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల ప్రత్యేక కార్యదర్శిగా బదిలీ అయ్యారు. 

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
