కూరగాయల ధరలు కుతకుత | Hyderabad: Vegetables Price Hike Due To Rains In Last Month | Sakshi
Sakshi News home page

వంటిల్లు.. చింతిల్లె..!

Nov 6 2020 8:10 AM | Updated on Nov 6 2020 10:38 AM

Hyderabad: Vegetables Price Hike Due To Rains In Last Month - Sakshi

సాక్షి, సిటీబ్యూరో: వంటింట్లో కూరగాయల ధరలు మండుతున్నాయి. నగర శివారు ప్రాంతాల నుంచి కూరగాయల దిగుమతులు తగ్గడంతో ఈ పరిస్థితి నెలకొంది. గత నెలలో కురిసిన వర్షాలతో చాలా ప్రాంతాల్లో పంట చేతికందకుండానే నేలపాలైంది. వాస్తవానికి ప్రతి చలికాలంలో కూరగాయల ధరలు తగ్గుతాయి. కానీ ఈ ఏడాది ధరలు మాత్రం రెట్టింపయ్యాయి. గుడిమల్కాపూర్, బోయిన్‌పల్లి, ఎల్‌బీనగర్, సికింద్రాబాద్‌ మోండా, మాదన్నపేట వంటి మార్కెట్‌లతో పాటు గ్రేటర్‌ పరిధిలో ఉన్న 11 రైతుబజార్లకు రోజువారీగా దిగుమతి కూరగాయలు రాక తగ్గిపోయింది. దీంతో ధరలు విపరీతంగా పెరిగాయి. చదవండి: కూరగాయల ధరలు 37% అప్‌!

► నగర జనాభా ప్రకారం ప్రతిరోజు దాదాపు మూడు వేల టన్నుల కూరగాయలు అవసరం. ఉమ్మడి రంగారెడ్డి, మెదక్‌ జిల్లాలే 60 శాతం తీరుస్తాయి.  
► మిగతా కూరగాయలు  కర్నూలు, చిత్తూరు, అనంతపురంతో పాటు కర్ణాటకలోని చిక్‌బల్లాపూర్‌ నుంచి దిగుమతి అవుతాయి.  
► కూరగాయల మార్కెట్లు, రైతు బజార్‌లతో ఏజెంట్లదే పెత్తనం. దీంతో వారు నిర్ణయించిన ధరే ఖరారు అవుతోంది. 
► వ్యాపారులంతా సిండికేట్‌ కావడంతో రైతులకు కూడా నష్టం వాటిల్లుతోంది.  
►  గ్రేటర్‌ పరిధిలో కూరగాయలు నిల్వ చేయడానికి ఎక్కడా కోల్డ్‌ స్టోరేజీ లేదు. దీంతో రైతులు నిల్వ చేసుకునే పరిస్థితి లేక ఎంతో కొంతకు అమ్ముకోవాల్సి వస్తోంది.  కూరగాయలు    గత ఏడాది    ప్రస్తుత

ధరలు   గతేడాది నవంబర్‌లో ప్రస్తుత ధరలు(కిలోకు) 
టమాటా  రూ. 15 రూ. 30 
బెండకాయ రూ. 30 రూ. 60
 బిన్నీస్‌ రూ. 40 రూ. 80
వంకాయ రూ. 20 రూ. 40
దొండకాయ రూ. 20 రూ. 40 
క్యాబేజీ   రూ. 30  రూ. 60
కాప్సికం  రూ.40 రూ. 80 
పచ్చిమిర్చి రూ. 20  రూ. 50

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement