మెట్రో ప్రయాణీకులకు శుభవార్త.. పండుగ ఆఫర్లు

Hyderabad Metro Discount In Charges During Festive Season - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: పండగల సందర్భంగా ప్రయాణికులకు మెట్రో శుభవార్త అందించింది. చార్జీల్లో రాయితీ ప్రకటించింది. ఈ సందర్భంగా.. హైదరాబాద్‌ మెట్రో ఎండీ ఎన్‌వీఎస్‌ రెడ్డి మాట్లాడుతూ.. అక్టోబర్ 17నుంచి 31 వరకు పలు ఆఫర్లు ఇస్తున్నట్లు తెలిపారు. ఈ ఆఫర్లు బతుకమ్మ నుంచి సంక్రాంతి వరకు ఈ ఆఫర్లు కొనసాగుతాయన్నారు. ఇక నగరాన్ని భారీ వర్షాలు ముంచెత్తిన నేపథ్యంలో.. వర్షాలకు సిటీలో చాలా ప్రాంతాల్లో రోడ్లు దెబ్బ తిన్నాయన్న ఆయన, ముసాపేట్ మెట్రో పిల్లర్‌కు ఎలాంటి ప్రమాదం లేదని స్పష్టం చేశారు. 

రేపటి నుంచి ఈనెలాఖరు వరకు ఈ కింది రాయితీ వర్తింపు 
మెట్రో సువర్ణ ఆఫర్ కింద ప్రయాణాల్లో ఈ నెల 31 వరకు 40 శాతం రాయితీ 

  • స్మార్ట్ కార్డు ద్వారా 14 ట్రిప్పుల చార్జీతో ... 30 రోజుల్లో 20 ట్రిప్పులు తిరిగే అవకాశం
  • 20 ట్రిప్పుల చార్జీతో...  45 రోజుల్లో 30 ట్రిప్పులు తిరిగే అవకాశం 
  • 40 ట్రిప్పుల చార్జీతో... 60 రోజుల్లో 60 ట్రిప్పులు తిరిగే అవకాశం

టీ సవారీ మొబైల్ అప్లికేషన్ ద్వారా నవంబర్ 1 తేదీ నుంచి ఈ ఆఫర్ అమలు 

  • 7 ట్రిప్పులకు చార్జీ చెల్లిస్తే ... 30 రోజుల్లో 10 ట్రిప్పులు తిరిగే అవకాశం 
  • 14 ట్రిప్పులకు చార్జీ చెల్లిస్తే ... 30 రోజుల్లో 20 ట్రిప్పులు తిరిగే అవకాశం
  • 20ట్రిప్పులకు చార్జీ చెల్లిస్తే ... 45 రోజుల్లో 30 ట్రిప్పులు తిరిగే అవకాశం 
  • 30 ట్రిప్పులకు చార్జీ చెల్లిస్తే ... 45 రోజుల్లో45 ట్రిప్పులు తిరిగే అవకాశం
  • 40 ట్రిప్పులకు చార్జీ చెల్లిస్తే ... 60 రోజుల్లో 60 ట్రిప్పులు తిరిగే అవకాశం
Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top