యువకుల సాహసం.. వెంటనే చెరువులో దూకి..

HYD: Two Young Man Jumped Into Pond And Rescued Woman - Sakshi

మనస్తాపానికి గురై మహిళ ఆత్మహత్యాయత్నం

చెరువులో దూకి కాపాడిని ఇద్దరు యువకులు 

సాక్షి, హైదరాబాద్‌ : కుటుంబంలో చిన్నపాటి గొడవలతో కొంత మంది విచక్షణ కోల్పోయి ప్రాణాల మీదికి తెచ్చుకుంటున్నారు. అలాంటి ఘటన గురువారం దూలపల్లిలో చోటుచేసుకుంది. దూలపల్లి కమ్మరిబస్తీ గుడిసెల్లో ఉండే భార్యాభర్తల మధ్య చిన్నపాటి గొడవ జరిగింది. దీంతో మనస్తాపానికి గురైన భార్య ఆత్మహత్య చేసుకునేందుకు పక్కనే ఉన్న లింగయ్య చెరువులో దూకింది. ఈ విషయాన్ని గుర్తించిన ఇద్దరు యువకులు వెంటనే చెరువులోకి దూకి మహిళను కాపాడికి ఒడ్డుకు తీసుకు వచ్చారు. దీంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top