షూటింగ్ రేంజ్‌లో చెలరేగిన మంత్రి శ్రీనివాస్ గౌడ్..

HYD: Minister Srinivas Goud Aim The Target At GFG Shooting Academy - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: హైద‌రాబాద్‌లో షూటింగ్ రేంజ్‌లను అప్‌గ్రేడ్ చేస్తామ‌ని తెలంగాణ క్రీడాశాఖ మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ హామీ ఇచ్చారు. హైదరాబాద్ సెంట్రల్‌ యూనివర్సిటీలోని గన్‌ ఫర్‌ గ్లోరీ షూటింగ్‌ అకాడమీ ఆధ్వర్యంలో బుధవారం జరిగిన చీర్‌ ఫర్‌ ఇండియా కార్యక్రమంలో మంత్రి శ్రీనివాస్‌, గగన్‌ నారంగ్‌ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా టోక్యో-2020 ఒలింపిక్స్‌ భారత బృందానికి మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ శుభాకాంక్షలు తెలిపారు. గన్‌ ఫర్‌ గ్లోరీ షూటింగ్‌ అకాడమీ నుంచి అయిదుగురు ఒలిపింక్స్‌కు వెళ్లడం గొప్ప విషయమని అన్నారు. గగన్‌ నారంగ్‌కు అన్ని విధాలా సహాయ సహకారాలు అందిస్తున్నామని తెలిపారు. హైద‌రాబాద్ నుంచి మ‌రింత మంది షూట‌ర్లు అంత‌ర్జాతీయ ఖ్యాతిని ఆర్జించాల‌ని ఆకాంక్షించారు.

ఈ సందర్భంగా మంత్రి సెంట్రల్ యూనివ‌ర్సిటీలోని శాట్స్ షూటింగ్ రేంజ్‌లో అడుగుపెట్ట‌గానే చెల‌రేగారు. అల‌వోక‌గా .22 వాల్త‌ర్ పిస్ట‌ల్‌ను అందుకుని ప్రొఫెష‌న‌ల్ త‌ర‌హాలో ప‌లు షాట్స్‌ను ఫైర్ చేశారు. మంత్రి టార్గెట్‌ను గురిపెట్టి ఫైర్‌ చేయడంతో ఒలింపిక్ మెడ‌ల్ విజేత‌, ఏస్ షూట‌ర్ గ‌గ‌న్ నారంగ్ స‌హా అక్క‌డున్న వారంతా ఆశ్చర్యపోయారు. పిస్ట‌ల్‌తోనే కాకుండా రైఫిల్‌, షాట్ గ‌న్‌, ఎయిర్ రైఫిల్‌తో ప‌ది మీట‌ర్ల రేంజ్‌లో సైతం చేసిన విన్యాసాలు అందరిని ఆక‌ట్టుకున్నాయి. షూటింగ్ అంటే ఇప్ప‌టికీ త‌న‌కు ఆస‌క్తి అధిక‌మ‌ని, నేష‌న‌ల్ రైఫిల్ అసోసియేష‌న్ ఆఫ్ ఇండియా (ఎన్ఆర్ఏఐ)లో తాను లైఫ్ మెంబ‌ర్‌న‌ని, త‌న‌కు లైసెన్డ్ గ‌న్ ఉంద‌ని మంత్రి శ్రీనివాస్ గౌడ్ పేర్కొన్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top