యాదగిరిగుట్టకు పోటెత్తిన భక్తులు

యాదగిరిగుట్ట: యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయానికి ఆదివారం భక్తులు పోటెత్తారు. ఇంటర్, పదోతరగతి పరీక్షలు పూర్తి కావడంతో భక్తులు ఒక్క సారిగా పెరిగారు. 40వేలకు పైగా భక్తులు స్వామి, అమ్మవారిని దర్శించుకోవడంతో ధర్మ దర్శనానికే 4 గంటల సమయం పట్టిం దని భక్తులు తెలిపారు.
వివిధ పూజల ద్వారా స్వామి వారికి రూ.45,50,079 ఆదాయం సమకూరిందని ఆలయ అధికారులు వెల్లడించారు. మరోవైపు స్వామివారిని రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి మాధవి దేవి కుటుంబసభ్యులతో కలిసి ఆదివారం దర్శిం చుకున్నారు.