యాదాద్రిలో భక్తుల రద్దీ  | Huge Devotees Rush At Yadadri Sri Lakshmi Narasimha Swamy Temple | Sakshi
Sakshi News home page

యాదాద్రిలో భక్తుల రద్దీ 

Aug 22 2022 1:46 AM | Updated on Aug 22 2022 9:43 AM

Huge Devotees Rush At Yadadri Sri Lakshmi Narasimha Swamy Temple - Sakshi

శ్రీస్వామిని దర్శించుకునేందుకు  వెళ్తున్న భక్తులు 

యాదగిరిగుట్ట: యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో భక్తుల రద్దీ నెలకొంది. ఆదివారం సెలవు రోజు కావడంతో పాటు శ్రావణమాసం ముగుస్తుండటంతో జంట నగరాలతో పాటు వివిధ రాష్ట్రాలు, జిల్లాల ప్రజలు క్షేత్రానికి అధిక సంఖ్యలో తరలి వ చ్చారు. దీంతో ఆలయ పరిసరాలు, క్యూలైన్లు భక్తులతో నిండిపోయాయి.

శ్రీస్వామి వారి ధర్మదర్శనానికి సుమారు మూడున్నర గంటల సమయం, వీఐపీ దర్శనానికి గంట సమయం పట్టినట్లు భక్తులు తెలిపారు. శ్రీస్వామిని 35 వేల మందికి పైగా భక్తులు దర్శించుకొని మొక్కులు తీర్చుకున్నారు. దీంతో వివిధ పూజల ద్వారా శ్రీస్వామి వారికి నిత్య ఆదాయం రూ.47,19,965 వచ్చినట్లు అధికారులు వెల్లడించారు. 

Advertisement
 
Advertisement
Advertisement