‘ఎంజీఎం’ బాధితుడి మృతదేహాన్ని ఇంట్లోకి అనుమతించని ఓనర్‌ | House Owner Not Allowed MGM Victim Body To Home In Hanamkonda | Sakshi
Sakshi News home page

‘ఎంజీఎం’ బాధితుడి మృతదేహాన్ని ఇంట్లోకి అనుమతించని ఓనర్‌

Apr 3 2022 3:02 AM | Updated on Apr 3 2022 8:58 AM

House Owner Not Allowed MGM Victim Body To Home In Hanamkonda - Sakshi

శ్రీనివాస్‌

హసన్‌పర్తి: నిమ్స్‌లో చికిత్స పొందుతూ శుక్రవారం రాత్రి మృతిచెందిన వరంగల్‌ ఎంజీఎం ఆస్పత్రిలో ఎలుకల దాడి బాధితుడు కడార్ల శ్రీనివాస్‌ (37) మృతదేహాన్ని ఇంట్లోకి తీసుకెళ్లేందుకు యజమాని నిరాకరించాడు. హనుమకొండలోని కుమార్‌పల్లిలో అద్దెకు ఉంటున్న ఇంటికి తీసుకురాగా యజమాని అభ్యంతరం చెప్పాడు. తన ఇంట్లోకి తీసుకు రావద్దని చెప్పడంతో భీమారంలోని ఆయన సోదరుడి ఇంటికి తీసుకెళ్లి అంత్యక్రియలు పూర్తి చేశారు.

హనుమకొండ ఆర్డీఓ వాసుచంద్ర, శ్రీనివాస్‌ మృతదేహానికి నివాళులర్పించారు. అంత్యక్రియల కోసం కుటుంబానికి రూ. 20 వేల ఆర్థిక సాయం అందించారు. శ్రీనివాస్‌ కుటుంబంలో ఒకరికి ఉద్యోగంతోపాటు డబుల్‌ బెడ్‌రూం ఇల్లు మంజూరు చేస్తామని ఎమ్మెల్యే అరూరి రమేశ్‌ తెలిపారు. ఈ అంశంపై వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావుతో మాట్లాడినట్లు చెప్పారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement