హైదరాబాద్‌లో మళ్లీ కుంభవృష్టి.. ద్రోణి ప్రభావంతో దంచికొట్టిన వాన

Heavy Rains Lash Out In Several Places In Hyderabad - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఉత్తర– దక్షిణ ద్రోణి ప్రభావంతో నగరంలో పలు ప్రాంతాల్లో మళ్లీ కుంభవృష్టి కురిసింది. సాయంత్రం వేళ ఒక్కసారిగా కురిసిన కుండపోతతో పలు కూడళ్ల వద్ద భారీగా ట్రాఫిక్‌ స్తంభించింది. ప్రధానంగా కూకట్‌పల్లి, మూసాపేట్, అమీర్‌పేట్, సోమాజిగూడ, పంజాగుట్ట, ఎర్రమంజిల్, ఖైరతాబాద్, నాంపల్లి, లక్డికాపూల్, అబిడ్స్, బషీర్‌బాగ్, నారాయణగూడ, సికింద్రాబాద్, తార్నాక, ఉప్పల్, కోఠి, చాదర్‌ఘాట్, మలక్‌పేట్‌ ప్రాంతాల్లో ప్రధాన రహదారులపై వరదనీరు పోటెత్తడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. రానున్న 24 గంటల్లో నగరంలో మోస్తరు నుంచి భారీ వర్షం కురిసే అవకాశాలున్నట్లు బేగంపేట్‌లోని వాతావరణ శాఖ తెలిపింది. 

మూసీలో కొనసాగుతున్న వరద ప్రవాహం  
ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో జంట జలాశయాలు హిమాయత్‌సాగర్, ఉస్మాన్‌సాగర్‌లకు వరదనీరు పోటెత్తుతోంది. దీంతో జలాశయాలకున్న పలు గేట్లను తెరచి మూసీలోకి వరదనీటిని వదిలిపెడుతున్నారు. సోమవారం సాయంత్రం 5 గంటల వరకు గండిపేట్‌ జలాశయంలోకి వెయ్యి క్యూసెక్కుల వరదనీరు చేరగా..4 గేట్లను 4 అడుగుల మేర తెరచి 1500 క్యూసెక్కుల నీటిని మూసీలోకి వదిలిపెట్టారు. హిమాయత్‌సాగర్‌లోకి 600 క్యూసెక్కుల వరద నీరు చేరగా.. రెండు గేట్లను ఒక అడుగు మేర తెరచి 660 క్యూసెక్కుల నీటిని మూసీలోకి వదిలిపెట్టినట్లు జలమండలి ప్రకటించింది.

మౌలాలి డివిజన్‌లో.. 
గౌతంనగర్‌: భారీ వర్షం కారణంగా మౌలాలి డివిజన్‌ పరిధిలోని పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. మౌలాలి దర్గా, పాత మౌలాలి, సాదుల్లానగర్, షఫీనగర్, భరత్‌నగర్, లక్ష్మీనగర్, సుధానగర్‌ తదితర కాలనీలు నీటి మునిగాయి. మల్కాజిగిరి,ఈస్ట్‌ ఆనంద్‌బాగ్‌ డివిజన్ల పరిధిలోని పలు కాలనీల్లో నాలాలు నిండి రహదారులపై వర్షం నీరు ఏరులై పారింది. సర్కిల్‌ పరిధిలోని ఎమర్జెన్సీ బృందాలు, కార్పొరేటర్లు సహాయక చర్యలు చేపట్టారు.  

పోలీస్‌ కంట్రోల్‌ రూం ఎదురుగా.. 
సాక్షి, సిటీబ్యూరో: ఉత్తర– దక్షిణ ద్రోణి ప్రభావంతో నగరంలో పలు ప్రాంతాల్లో మళ్లీ కుంభవృష్టి కురిసింది. సాయంత్రం వేళ ఒక్కసారిగా కురిసిన కుండపోతతో పలు కూడళ్ల వద్ద భారీగా ట్రాఫిక్‌ స్తంభించింది. ప్రధానంగా కూకట్‌పల్లి, మూసాపేట్, అమీర్‌పేట్, సోమాజిగూడ, పంజాగుట్ట, ఎర్రమంజిల్, ఖైరతాబాద్, నాంపల్లి, లక్డికాపూల్, అబిడ్స్, బషీర్‌బాగ్, నారాయణగూడ, సికింద్రాబాద్, తార్నాక, ఉప్పల్, కోఠి, చాదర్‌ఘాట్, మలక్‌పేట్‌ ప్రాంతాల్లో ప్రధాన రహదారులపై వరదనీరు పోటెత్తడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. రానున్న 24 గంటల్లో నగరంలో మోస్తరు నుంచి భారీ వర్షం కురిసే అవకాశాలున్నట్లు బేగంపేట్‌లోని వాతావరణ శాఖ తెలిపింది. 

మూసీలో కొనసాగుతున్న వరద ప్రవాహం  
ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో జంట జలాశయాలు హిమాయత్‌సాగర్, ఉస్మాన్‌సాగర్‌లకు వరదనీరు పోటెత్తుతోంది. దీంతో జలాశయాలకున్న పలు గేట్లను తెరచి మూసీలోకి వరదనీటిని వదిలిపెడుతున్నారు. సోమవారం సాయంత్రం 5 గంటల వరకు గండిపేట్‌ జలాశయంలోకి వెయ్యి క్యూసెక్కుల వరదనీరు చేరగా..4 గేట్లను 4 అడుగుల మేర తెరచి 1500 క్యూసెక్కుల నీటిని మూసీలోకి వదిలిపెట్టారు. హిమాయత్‌సాగర్‌లోకి 600 క్యూసెక్కుల వరద నీరు చేరగా.. రెండు గేట్లను ఒక అడుగు మేర తెరచి 660 క్యూసెక్కుల నీటిని మూసీలోకి వదిలిపెట్టినట్లు జలమండలి ప్రకటించింది.

 

బంజారాహిల్స్‌, జూబ్లీహిల్స్‌, పంజగుట్ట, అమీర్‌పేట్‌, మాదాపూర్‌, జీడిమెట్ల, లింగంపల్లి, గచ్చిబౌలి, కూకట్‌పల్లి, మారేపల్లి, కంటోన్మెంట్‌ ప్రాంతాల్లో వాన దంచికొడుతోంది. అదే విధంగా హబ్సిగూడ, ఓయూ, నాచారం, అంబర్‌పేట, సికింద్రాబాద్‌, తార్నాక, కుత్బుల్లాపూర్‌, సురారం, చింతల్‌, గాజుల రామారం, కొంపల్లి బహూదూర్‌ పల్లి, షాపూర్‌ ప్రాంతాల్లో భారీ వర్షం పడుతోంది. 
చదవండి: క్యాబ్‌ లేదా ఆటో రైడ్‌ బుకింగ్‌ చేస్తున్నారా? చేతిలో నగదు లేదా?

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top