భారీ వర్షం: రేపు హైదరాబాద్‌కు కేంద్ర బృందం | Heavy Rains: Central Team Visits HYD On Tomorrow | Sakshi
Sakshi News home page

భారీ వర్షం: రేపు హైదరాబాద్‌కు కేంద్ర బృందం

Oct 21 2020 12:03 PM | Updated on Oct 21 2020 12:37 PM

Heavy Rains: Central Team Visits HYD On Tomorrow - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: గత కొన్ని​రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు మహా నగరాన్ని అతలాకుతలం చేస్తున్నాయి. లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. వరద నీటితో మునిగిన ప్రాంతాల్లో నివాసముంటున్న ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని సహాయక చర్యలు చేపడుతోంది. డీఆర్ఎఫ్ బృందాలు వర్షాభావ ప్రాంతాల్లో బోట్లను కూడా అందుబాటులో ఉంచారు. మరోవైపు వర్షాలతో నష్టపోయిన ప్రజలను ఆదుకునేందుకు టాలీవుడ్ ప్రముఖులు సైతం తమవంతు ఆర్ధిక సాయాన్ని తెలంగాణ సీఎం రిలీఫ్ ఫండ్‌కు అందించారు. చదవండి: సిటీలో పలు చోట్ల భారీ వర్షం

ఇదిలా ఉండగా ఈ రోజు(బుధవారం) సాయంత్రం కేంద్ర బృందం హైదరాబాద్‌కు రానుంది. రెండు రోజులపాటు వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించనున్నారు. ఇక వర్షాలతో రాష్ట్రంలో వేల కోట్ల నష్టం వాటిల్లిందని ప్రభుత్వం అంచనా వేస్తోంది. ఇందుకు తక్షణ సాయంగా రూ.1350 కోట్లు విడుదల చేయాలని ప్రధాని మోదీకి సీఎం కేసీఆర్ లేఖ రాశారు. ఈ నేపథ్యంలో కేంద్ర బృందం నగరానికి విచ్చేయనుంది. చదవండి:  ఆర్థిక సాయం: ఇంటికి పదివేలు.. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement