Hyderabad: అర్ధరాత్రి హైదరాబాద్‌ను ముంచెత్తిన భారీ వర్షం | Heavy Rain Lash City of Hyderabad | Sakshi
Sakshi News home page

Hyderabad: అర్ధరాత్రి హైదరాబాద్‌ను ముంచెత్తిన భారీ వర్షం

Jul 26 2022 2:01 AM | Updated on Jul 26 2022 8:13 AM

Heavy Rain Lash City of Hyderabad - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: మరోసారి హైదరాబాద్‌ను భారీ వర్షం ముంచెత్తింది. సోమవారం అర్ధరాత్రి దాటాక నగరంలోని పలుప్రాంతాల్లో వాన దంచికొట్టింది దీంతో వరద నీరు భారీగా రోడ్ల మీదకు చేరింది. పాతబస్తీ, మొఘల్‌పురా, సుల్తాన్‌షాహీ, బహదూర్‌పురా, చార్మినార్‌, ఎల్బీనగర్‌, టోలీచౌక్‌ దిల్‌సుఖ్‌నగర్‌, బంజారాహిల్స్‌, జూబ్లీహిల్స్‌, పంజాగుట్టలో భారీ వర్షం కురిసింది.

మంగళవారం ఉదయం వరకు నగరంలోని అనేక ప్రాంతాలతో పాటు, పలు జిల్లాల్లో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది. దీంతో జీహెచ్‌ఎంసీ, పోలీస్‌ అధికారులు అప్రమత్తమయ్యారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement