
హైదరాబాద్: హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్(హెచ్‌సీఏ)లో అవినీతి ఆరోపణల కేసులో జనరల్ సెక్రటరీ దేవరాజ్‌ను ఎట్టకేలకు తెలంగాణ సీఐడీ అరెస్ట్ చేసింది. తమిళనాడులో దేవరాజ్‌ను సీఐడీ పోలీసులు పట్టుకున్నారు. ఈ కేసులో ఏ-2గా ఉన్న దేవరాజ్.. 17రోజులుగా పరారీలో ఉన్నారు. సీఐడీ కేసు నమోదు చేసినప్పట్నుంచీ దేవరాజ్ పరారీలో ఉన్నారు.
హెచ్‌సీఏ వివాదంలో ప్రెసిడెంట్ జగన్మోహన్‌రావును ఈ నెల 9వ తేదీన తెలంగాణ సీఐడీ అరెస్ట్ చేసింది. జగన్మోహన్‌రావుతో పాటు పలువుర్ని అరెస్ట్ చేశారు. ఈ కేసులో జగన్మోహన్‌రావు ఏ-1గా ఉన్నారు.ఐపీఎల్ టికెట్ల వ్యవహారంలో విజిలెన్స్ సిఫార్సు మేరకు సీఐడీ దర్యాప్తు ేచేపట్టింది. దీనిలో భాగంగా ఏ-2గా ఉన్న జనరల్ సెక్రటరీ దేవరాజ్‌ను పోలీసులు ఈరోజు(శుక్రవారం, జూలై 25) అరెస్ట్ చేయడంతో విచారణ వేగవంతమయ్యే అవకాశం ఉంది.
గత ఐపీఎల్ సీజన్‌లో హెచ్‌సీఏ-ఎస్‌ఆర్‌హెచ్ మధ్య టికెట్ల వివాదం జరిగిన సంగతి తెలిసిందే. హెచ్‌సీఏ ప్రెసిడెంట్ హోదాలో ఎస్‌ఆర్‌హెచ్ ఫ్రాంచైజీని జగన్‌మోహన్‌రావు బెదిరించారన్నది ప్రధాన అభియోగం. అయితే ఆ అభియోగాలన్నీ వాస్తవమేనని విజిలెన్స్ నిర్ధారించడంతో సీఐడీ ఇప్పుడు అరెస్టులు చేసింది.
హెచ్‌సీఏకు ఎస్‌ఆర్‌హెచ్ యాజమాన్యం 10 శాతం టికెట్లు ఉచితంగా ఇస్తోంది. అయితే మరో 20 శాతం టికెట్లు ఫ్రీగా ఇవ్వాలని, లేకుంటే మ్యాచ్‌లు జరగబోనివ్వమని ఎస్‌ఆర్‌హెచ్ యాజమాన్యాన్ని జగన్‌మోహన్‌రావు డిమాండ్ చేశారు. ఈ క్రమంలోనే హెచ్‌సీఏలో భారీ స్కామ్‌లు వెలుగుచూడటంతో అందులోని పెద్దల పాత్రపై దర్యాప్తు చేపట్టింది సీఐడీ.