వడగళ్ల వానతో 250 ఎకరాల్లో దెబ్బతిన్న మొక్కజొన్న | Hailstorm Havoc in Telangana: Farmers Suffer Heavy Crop Losses | Sakshi
Sakshi News home page

వడగళ్ల వానతో 250 ఎకరాల్లో దెబ్బతిన్న మొక్కజొన్న

Mar 21 2026 4:50 AM | Updated on Mar 21 2026 4:50 AM

Hailstorm Havoc in Telangana: Farmers Suffer Heavy Crop Losses

తడిసి ముద్దయిన పసుపు

జక్రాన్‌పల్లి: నిజామాబాద్‌ జిల్లా జక్రాన్‌ పల్లి మండలంలో శుక్రవా రం కురిసిన భారీ వడగళ్ల వర్షానికి తీవ్ర పంట నష్టం వాటిల్లింది. మండలంలోని జక్రాన్‌ పల్లి, అర్గుల్, తొర్లికొండ గ్రామాల్లో మొక్కజొన్న పంట నేల వాలింది. సుమారు 250 ఎకరాల్లో మొక్కజొన్నకు నష్టం జరిగింది.

అలాగే కల్లాలలో ఆరబెట్టిన పసుపు పంట తడిసి ముద్దయింది. చేతికొచ్చిన పంట నష్టపోవడంతో రైతులు ఆవేదన చెందుతున్నారు. తమ గ్రామాల్లో దెబ్బతిన్న పంటలను అధికారులు పరిశీలించాలని, ప్రభుత్వం స్పందించి నష్టపోయిన పంటలకు పరిహారం చెల్లించాలని రైతులు కోరుతున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement