గ్రేహౌండ్స్‌ సిబ్బంది ఇతర విభాగాల్లోకి.. | Greyhounds staff transferred to other departments | Sakshi
Sakshi News home page

గ్రేహౌండ్స్‌ సిబ్బంది ఇతర విభాగాల్లోకి..

Jun 11 2026 4:10 AM | Updated on Jun 11 2026 4:11 AM

Greyhounds staff transferred to other departments

మావోయిస్టు సమస్య పోయింది

ఆదిలాబాద్‌ జిల్లాలో డీజీపీ సీవీ ఆనంద్‌

సాక్షి, ఆదిలాబాద్‌: ‘పోలీసు డిపార్ట్‌మెంట్‌ ప్రయా ణం కొత్త దిశలో ఉంది. క్రైమ్‌ స్వరూపం మారిపో యిన దృష్ట్యా శాఖలో కూడా అందుకు తగ్గట్టుగా మార్పులు చేస్తున్నాం. మావోయిస్టు సమస్య పోయింది. దానికోసమే ఏర్పడ్డ గ్రేహౌండ్స్, ఎస్‌ఐ బీ విభాగాల్లోని సిబ్బందిని ఇతర విభాగాల్లోకి తీసుకుంటాం. ట్రాఫిక్‌ మేనేజ్‌మెంట్‌ అండ్‌ రోడ్‌ సేఫ్టీ బ్యూరో, టీజీ టెక్నికల్‌ టీమ్‌ (టీస్పార్క్‌), విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్, ఫుడ్‌ అండ్‌ డ్రగ్‌ కల్తీ నిరోధక విభాగాల ఏర్పాటుతో డ్రగ్స్, సైబర్‌ సెక్యూ రిటీ, సైబర్‌ క్రైమ్, ట్రాఫిక్, హైవే యాక్సి డెంట్స్‌ నిరోధానికి చర్యలు చేపడతాం. ఇందుకు తక్షణం ఆయా విభాగాల్లోని 800 మందిని తీసుకుని వారి సేవలను వినియోగించుకుంటాం’  అని డీజీపీ సీవీ ఆనంద్‌ అన్నారు. 

మంగళవారం రాత్రి ఆదిలా బాద్‌ చేరుకున్న ఆయన బుధవారం జిల్లాలో వివిధ కార్యక్ర మాల్లో పాల్గొన్నారు. మధ్యాహ్నం జిల్లా కేంద్రంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. ‘ముప్‌పై, నలభై ఏళ్లుగా మన రాష్ట్రం ఒకే ఆలోచనతో పనిచేసింది. నక్సలైట్లు, మావోయిజం ఎదుర్కోవడానికి పోలీసు శాఖ వివిధ విభాగాల ను అప్పట్లో ఏర్పాటు చేసింది. ఈ దళాల పోరాటం, కేంద్ర ప్రభుత్వం కఠిన చర్యలతో మావోయిజం పూర్తిగా పోయిందని భావించవచ్చు.

మన రాష్ట్రంలో లొంగిపోయిన మావోయిస్టులకు రివార్డులు ఇచ్చాం. వారు జనజీవన స్రవంతిలో కలిసేందుకు ఉపాధి, ఉద్యోగాలు కల్పించాం’ అని ఆనంద్‌ చెప్పారు. సమావేశంలో ఉమెన్‌ సేఫ్టీ, సీఐడీ, ఏసీబీ డీజీ చారు సిన్హా, నార్కోటిక్స్‌ ఇన్‌చార్జి సందీప్‌ శాండిల్య, మల్టీజోన్‌–1 ఐజీ ఎస్‌.చంద్రశేఖర్‌ రెడ్డి, ఆదిలాబాద్‌ ఎస్పీ అఖిల్‌ మహాజన్‌ పాల్గొన్నారు.

గ్రామసభల్లో పాల్గొన్న డీజీపీ
రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న ప్రజాపాలన–ప్రగతి ప్రణాళికలో భాగంగా జిల్లాలోని గుడి హత్నూర్‌ మండలం తోషం గ్రామంలో నిర్వహించిన గ్రామసభలో డీజీపీ ఆనంద్‌ పాల్గొన్నారు. పోలీసు శాఖ నిర్వహిస్తున్న అరైవ్‌.. అలైవ్‌ కార్యక్రమాన్ని వివరించారు. ఆదివాసీ సంస్కృతి, సంప్రదాయాల ప్రకారం గ్రామ పెద్దలు డీజీపీకి ఘన స్వాగతం పలికారు. డీజీపీతోపాటు ఇతర అధికారులకు తలపాగా ధరింపజేశారు. కాగా, నిర్మల్‌ జిల్లా ఎస్పీ జానకీ షర్మిల ఆధ్వర్యంలో వినూత్నంగా అమలు చేస్తున్న ‘పోలీస్‌ అక్క’ కార్యక్రమాన్ని డీజీపీ సీవీ.ఆనంద్‌ అభినందించారు. 

Advertisement
 
Advertisement
Advertisement