జూన్‌ 8న చేప ప్రసాదం పంపిణీ | Fish Prasadam In Hyderabad | Sakshi
Sakshi News home page

జూన్‌ 8న చేప ప్రసాదం పంపిణీ

May 6 2026 12:36 PM | Updated on May 6 2026 12:55 PM

Fish Prasadam In Hyderabad

హైదరాబాద్‌: ఆస్తమా వ్యాధిగ్రస్తులకు బత్తిని కుటుంబ సభ్యులు అందించే చేప ప్రసాదాన్ని జూన్‌ 8వ తేదీన ప్రారంభించనున్నట్లు బత్తిని కుటుంబ సభ్యులు అమర్‌నాథ్‌ గౌడ్, గౌరీ శంకర్‌ గౌడ్, అనిరుధ్‌ గౌడ్, దుర్గా గౌడ్‌ మంగళవారం తెలిపారు. మృగశిర కార్తె ప్రవేశం రోజైన 8వ తేదీన దూద్‌బౌలిలోని తమ నివాసంలో ప్రత్యేక వనమూలికలతో చేప ప్రసాదాన్ని తయారు చేస్తా మన్నారు. ఆ రోజు తమ కుటుంబ సభ్యులు, బంధువులు చేప ప్రసాదాన్ని సేవించిన అనంతరం సాయంత్రం నాంపల్లిలోని ఎగ్జిబిషన్‌ మైదానానికి తరలించి రాత్రి 9 గంటలకు చేప ప్రసాదాన్ని పంపిణీ చేస్తామన్నారు. 10వ తేదీన దూద్‌»ౌలిలోని తమ నివాసంలో చేప ప్రసాదం పంపిణీ చేస్తామన్నారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement