మహబూబాబాద్‌: బొడ్రాయి పండుగలో అపశ్రుతి | Fire accident In Mahabubabad Bodrai Festival | Sakshi
Sakshi News home page

మహబూబాబాద్‌: బొడ్రాయి పండుగలో అపశ్రుతి

May 7 2023 4:47 PM | Updated on May 7 2023 5:28 PM

Fire accident In Mahabubabad Bodrai Festival - Sakshi

సాక్షి, మహబూబాబాద్‌: జిల్లాలోని కంబాలపల్లిలో బొడ్రాయి పండుగలో అపశ్రుతి చోటుచేసుకుంది. గ్రామ దేవతల ప్రతిష్టాపన సందర్భంగా గ్రామస్థులు బోనాలు నిర్వహించారు. బోనాలతో గ్రామస్థులు బొడ్రాయి వద్దకు చేరుకోగ.. బోనంపై ఉన్న దీపం పైన పందిరి గడ్డిని తగలగడంతో మంటలు చెలరేగాయి. దీంతో యాగశాల  పూర్తిగా దగ్గమయ్యింది. ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో భక్తులు భయంతో పరుగులు తీశారు. ఎగిసిపడిన మంటలను గ్రామస్థులు బిందెలతో నీళ్లు చల్లి అదుపులోకి తీసుకువచ్చారు.

అయితే అప్పటికే గడ్డి, తడకల పందిరి పూర్తిగా దగ్ధమయ్యింది. భక్తులకు ఎలాంటి హాని జరగకపోవడంతో అందరు ఊపిరిపీల్చుకున్నారు. బొడ్రాయి పండుగలో నరదృష్టి పోయిందని గ్రామస్థులు భావిస్తున్నారు. మంటలు అదుపులోకి వచ్చాక ఎంపీ మాలోతు కవిత ఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. బొడ్రాయి ప్రతిష్టాపన వేడుకల్లో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. 
చదవండి: మృత్యు ఘంటికలు!.. మధ్యాహ్నం 3 నుంచి రాత్రి 9 గంటల వరకు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement