Representative image
హైదరాబాద్: తెలంగాణ వ్యాప్తంగా ఈగల్ ఫోర్స్ ఆపరేషన్ చేపట్టింది. డ్రగ్స్, గంజాయి వినియోగిస్తున్న 19 మందిని అరెస్ట్ చేసింది. పట్టుబడి వారిలో 14 మందికి గంజాయి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఆయా వినియోగదారులు చక్రపాణి, హర్షిత్ నుంచి డ్రగ్స్ కొనుగోలు చేశారు.
గతంలో ఎన్డీపీఎస్ చట్ట కింద చక్రపాణి, హర్షిత్ అరెస్ట్ అయ్యారు. అయినప‍్పటికీ ఈ దందాను ఆపలేదు. డగ్స్ వినియోగదారులపై తెలంగాణ ఈగల్ ఫోర్స్ ఆపరేషన్లు కొనసాగిస్తూనే ఉంది. కొకైన్, ఎండీఎంఏ, ఎల్‌ఎస్‌డీ, హ్యాష్ ఆయిల్ సరఫరా చేస్తున్న ముఠాల ఆటలు కట్టిస్తోంది.
మాదాపూర్‌లో 2 రోజుల క్రితమే..
హైదరాబాద్‌లోని మాదాపూర్‌లో ఆదివారం (జూన్ 14న) డ్రగ్స్ భారీగా పట్టుబడిన విషయం తెలిసిందే. ఆ సమయంలో ఒకరిని అరెస్ట్ చేసిన పోలీసులు మరో ఎనిమిది మంది వినియోగదారులను అదుపులోకి తీసుకున్నారు. నిందితుడి వద్ద నుంచి 15 గ్రాముల ఎండీఎంఏ, 382 గ్రాముల ఓజీ కుష్ గంజాయి స్వాధీనం చేసుకున్నారు. డ్రగ్స్‌తో పాటు 9 మొబైల్ ఫోన్లు, 2 బరువు తూచే మిషన్లు, ప్యాకింగ్ మెటీరియల్ సీజ్ చేశారు.


