గ్లాస్గో నుంచి డాక్టర్ రఘురాంకు అరుదైన గుర్తింపు | drRaghu Ram Receives Honorary Fellowship from RCPSG | Sakshi
Sakshi News home page

గ్లాస్గో నుంచి డాక్టర్ రఘురాంకు అరుదైన గుర్తింపు

Sep 11 2025 7:21 PM | Updated on Sep 11 2025 8:07 PM

drRaghu Ram Receives Honorary Fellowship from RCPSG

కిమ్స్ ఉషాలక్ష్మి బ్రెస్ట్ డిసీజెస్ సెంటర్ స్థాపక డైరెక్టర్ డాక్టర్ రఘురామ్ పిల్లరిశెట్టి అరుదైన గౌరవాన్ని అందుకున్నారు. బ్రిటన్లోని గ్లాస్గో రాయల్ కాలేజ్ ఆఫ్ ఫిజీషియన్స్ అండ్ సర్జన్స్ (RCPSG) వారు ఆయనకు గౌరవప్రదమైన ఎఫ్‌ఆర్‌సీఎస్‌(గ్లాస్గో) ను ప్రదానం చేశారు. ఈ గౌరవం పొందిన దక్షిణాసియాలోని అతి పిన్న వయస్కుడైన శస్త్రవైద్యుడిగా ఆయన చరిత్రలో నిలిచారు. ఇది మాత్రమే కాకుండా డాక్టర్ రఘురామ్ 1997లో ఇదే కాలేజ్ నుంచి ఎస్‌ఆర్‌సీఎస్‌ ద్వారా (గ్లాస్గో) పరీక్ష ద్వారా అర్హత పొందారు. ఇప్పుడు అదే కాలేజ్ నుంచి గౌరవ ఫెలోషిప్ పొందిన ప్రపంచంలో ఏకైక శస్త్రవైద్యుడు అయారు.

ఈ అత్యున్నత గౌరవం 425 ఏళ్ల పురాతనమైన గ్లాస్గో రాయల్ కాలేజ్ తరఫున, 2025 సెప్టెంబర్ 10న, గ్లాస్గోలోని చారిత్రాత్మక కాలేజ్ హాల్లో జరిగిన ప్రత్యేక్ష కార్యక్రమంలో, కాలేజ్ అధ్యక్షుడు ప్రొఫెసర్ హనీ ఎటీబా డాక్టర్ రఘురామ్ పిల్లరిశెట్టికి అధికారికంగా ప్రదానం చేశారు. ఈ సందర్భంగా గ్లాస్గో రాయల్ కాలేజ్ ఆఫ్ ఫిజీషియన్స్ అండ్ సర్జన్స్ అధ్యక్షుడు ప్రొఫెసర్ హనీ ఎటీబా మాట్లాడుతూ..

డాక్టర్ పిల్లరిశెట్టికి మా కాలేజ్ తరఫున అత్యున్నత గౌరవమైన హానరరీ ఫెలోషిప్ అందించడంలో నాకు ఎంతో ఆనందంగా ఉంది. గత రెండు దశాబ్దాలుగా, ఆయన తన సమస్త జీవనాన్ని రొమ్ము క్యాన్సర్తో పోరాటంలో ప్రజలకు ఆశనిస్తూ, సేవలో నిమగ్నమయ్యారు. బ్రిటన్, భారత్ సహా ప్రపంచవ్యాప్తంగా శస్త్రవైద్యుల మధ్య సాన్నిహిత్యాన్ని పెంపొందించడంలో ఆయన పాత్ర అస్తాధారణం. శస్త్రచికిత్సలో నాణ్యతా ప్రమాణాలు, ప్రజారోగ్యం అభివృద్ధి పరంగా మేము తీసుకుంటున్న మిషన్లో ఆయన ఓ ముఖ్య భాగస్వామిగా మారారు. మా కాలేజ్ కుటుంబంలో ఆయనను ఆహ్వానించడంపై మాకు ఎంతో గర్వంగా ఉంది. భారత్ బ్రిటన్‌ల మధ్య సంబంధాలను మరింత బలపరిచే దిశగా ఈ కలయిక పనిచేస్తుందని మా విశ్వాసమని పేర్కొన్నారు.

గౌరవ ఫెలోషిప్ ప్రదానోత్సవ సందర్భంగా గ్లాస్గో రాయల్ కాలేజ్ ఆఫ్ ఫిజీషియన్స్ అండ్ సర్జన్స్ రిజిస్ట్రార్, ట్రస్టీ  ప్రొఫెసర్ అభయ్ రేన్ చదివారు. దాదాపు రెండు దశాబ్దాలుగా భారతదేశంలో రొమ్ము క్యాన్సర్ చికిత్సలో డాక్టర్. రఘురామ్ చేసిన విప్లవాత్మక మార్పులు అమూల్యమైనవని ప్రశంసించారు. హైదరాబాద్‌లో  నిర్వహించిన 12 అంతర్జాతీయ ఎస్ఆర్సిఎస్/ఎంఆర్సిఎస్ ప్రిపరేటరీ కోర్సులకు ఆయనే ముందుండి నాయకత్వం వహించారని, వాటి ద్వారా దక్షిణాసియాలోని 2,000 మందికి పైగా వైద్య విద్యార్థులు ప్రతిష్టాత్మక పరీక్షల్లో విజయవంతం అయ్యే అవకాశం పొందారన్నారు. అంతేకాకుండా, భారతదేశంలో కాలేజ్ చేపట్టిన విద్యా కార్యక్రమాలకు డాక్టర్ రఘురామ్ అందించిన వ్యూహాత్మక మార్గనిర్దేశనం ఎంతో కీలకమైందని, అది కాలేజ్ విద్యా ప్రమాణాల బలోపేతానికి దోహదపడిందని ఆయన పేర్కొన్నారు.


డాక్టర్ రఘురామ్ పిల్లరిశెట్టి మాట్లాడుతూ 'ఈ అత్యున్నత గౌరవాన్ని ప్రదానం చేసినందుకు ఆర్సిపి ఎన్జీ అధ్యక్షుడికి నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఈ ప్రత్యేక గుర్తింపును నా కుటుంబం, నా రోగులు, నా తల్లితండడ్రులకు ఈ నేలకి అంకితం చేస్తున్నాను.

1599లో స్థాపించబడిన గ్లాసో రాయల్ కాలేజ్ ఆఫ్ ఫిజీషియన్స్ అండ్ సర్జన్స్ ఇప్పటివరకు 425 సంవత్సరాల చరిత్రను కలిగి ఉంది. బ్రిటిష్ దీవుల్లో ఏకైక బహుళ శాఖా వైద్య కళాశాలగా ఇది ఉన్నది. ప్రపంచంలోని 97 దేశాల నుంచి వచ్చిన 15,000కి పైగా శస్త్రవైద్యులు, దంతవైద్యులు, పొడియాట్రీ మరియు ట్రావెల్ మెడిసిన్ రంగాల్లో పని చేసే నిపుణులను ఇది ప్రతినిధ్యం వహిస్తోంది. తర్వాత, కాలేజ్ అధ్యక్షుడు ప్రఖ్యాత ‘ఎంఆర్సీఎస్’, ఎఫ్‌ఆర్‌సీఎస్‌ సర్టిఫికెట్లు అందజేశారు. ఈ సర్టిఫికెట్లు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందినవి. ఇవి ఇంటర్కలేజియేట్ పరీక్షలో ఉత్తీరులు అయిన,శిక్షణ అవసరాలను పూర్తి చేసిన వైద్యులకు మాత్రమే ఇస్తారు.

డాక్టర్ రఘురామ్ పిల్లరిశెట్టికి ప్రపంచంలోనే ప్రసిద్ధి చెందిన మరో 7 శస్త్రచికిత్స కళాశాలల నుండి హానర్జరీ ఫెలోషిప్లు ప్రదానం చేయబడ్డాయి. పద్మశ్రీ, డాక్టర్ బీసీ రాయ్ జాతీయ అవార్డు గ్రహీత అయిన ఆయన, బ్రిటన్‌లోని మూడు శస్త్రచికిత్స రాయల్ కాలేజ్ నుండి, బ్రిటిష్ ప్రభుత్వ నుండి అత్యున్నత గౌరవాలు అందుకున్న ఏకైక శస్త్రవైద్యుడిగా ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపుపొందిన వ్యక్తి

డాక్టర్ రఘురామ్ పిల్లరిశెట్టికి లభించిన ప్రధాన గౌరవాలు ఇవీ:

బ్రిటిష్ సామ్రాజ్య గౌరవ విధాన అధికారి (ఆఫీసర్ ఆఫ్ ది మోస్ట్ ఎక్సలెంట్ ఆర్డర్ ఆఫ్ ది బ్రిటిష్ ఎంపైర్ 2020) నైట్హుడ్ను తప్పిస్తే బ్రిటిష్ సామ్రాజ్యంలో రెండో స్థాయి అత్యున్నత అవార్డు.

హానరరీ ఎస్ఆర్సీఎస్ (ఇంగ్లాండ్), 2022- రాయల్ కాలేజ్ ఆఫ్ సర్జన్లు ఆఫ్ ఇంగ్లాండ్ యొక్క అత్యున్నత గౌరవం.

హానరరీ ఎస్ఆర్సీఎస్ (గ్లాస్గో), 2025 - రాయల్ కాలేజ్ ఆఫ్ ఫిజీషియన్స్ అండ్ సర్జన్స్ ఆఫ్ గ్లాస్గో అత్యున్నత గౌరవం. యూకే వెలుపల ఇంటర్నేషనల్ గోల్డ్ మెడల్ (ఆర్సీఎస్ ఎడిన్బర్), 2013 నివసిస్తున్న రాయల్ కాలేజ్ ఆఫ్ సర్జన్ల ఎడిన్బర్గ్ ఫెలోకు లభించే అత్యున్నత గౌరవం. 

డాక్టర్ రఘురామ్ పిల్లరిశెట్టి గత 18 సంవత్సరాలలో భారతదేశంలో రొమ్ము క్యాన్సర్ చికిత్స రంగంలో విప్లవాత్మక మార్పులు తెచ్చారు. ఆయన దక్షిణాసియాలోని మొదటి సమగ్ర బ్రెస్ట్ హెల్త్ సెంటర్ ని స్థాపించి, దేశవ్యాప్తంగా రొమ్ము క్యాన్సర్ అవగాహన పెంపొందించడానికి ఓ చారిటబుల్ ఫౌండేషన్ కూడా ప్రారంభించారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ప్రారంభించిన దక్షిణాసియాలోనే అతిపెద్ద జనాభాపరమైన స్క్రీనింగ్ కార్యక్కరమాలు ఆయన అమలు చేశారు. ఇది ప్రస్తుతం దేశవ్యాప్తంగా విస్తరించబడుతోంది. భారతదేశంలో రొమ్ము శస్త్రచికిత్స చేసే శస్త్రవైద్యులను ప్రతినిధ్యం వహించే దక్షిణాసియాలోని మొదటి మరియు ఏకైక సంస్థ, "అసోసియేషన్ ఆఫ్ బ్రెస్ట్ సర్జన్స్ ఆఫ్ ఇండియా" ఏర్పాటులో ఆయన కీలకపాత్ర పోషించారు. తన తల్లిప్రేము మరియు సామాజిక సేవా పట్ల ఉన్న అభిమానం ఆయన వ్యక్తిత్వ లక్షణాలు. తెలంగాణలోని ఒక దూర ప్రాంత గ్రామమైన ఇబ్రాహింపూర్ను ఆయన దత్తత తీసుకుని, వ్యక్తిగత దాతృత్వం ద్వారా అక్కడ జీవనోపాధి మార్పులు తేవడమైన పరికరాలు, సౌకర్యాలు అందించారు. ఈ సేవలకు స్థానిక, ప్రాంతీయ, జాతీయ స్థాయిలో గౌరవాలు లభించాయి.

చారిత్రాత్మక ఈ కాలేజ్ తో సన్నిహితంగా సంబంధం కలిగిన కొన్ని ప్రముఖ శస్త్రవైద్యుల్లో ప్రొఫెసర్ పీటర్ లోని ఉన్నారు. ఆయన ఆర్సీపిఎస్టీ స్థాపకుడు కాగా, 1597లో ఇంగ్లీష్ లో తొలి శస్త్రచికిత్స పుస్తకాన్ని ప్రచురించారు. సర్ విలియమ్ మేస్వాన్, 'న్యూరో శస్త్రచికిత్స తండ్రి"గా ప్రసిద్ధి పొందిన ఆయన, మొదటి మెదడు కణితిని తొలగించిన శస్త్రవైద్యుడిగా గుర్తింపు పొందారు. ప్రొఫెసర్ జోసెఫ్ లిస్టర్ శస్త్రచికిత్సలో శుద్ధి పద్దతుల పితామహుడిగా పేరుగాంచారు. ప్రొఫెసర్ సర్ గ్రీమ్ టీస్ డేల్ మరియు ప్రొఫెసర్ బ్రయాన్ బెనెట్ గ్లాస్గో కోమా స్కేల్ను స్థాపించారు, ఇది ప్రపంచవ్యాప్తంగా అవగాహన స్థాయిని అంచనా వేయడానికి ఉపయోగించే ప్రసిద్ధ పరికరం, అలాగే, ప్రొఫెసర్ జమిని సేన్ భారతీయ శస్త్రవైద్యురాలు మరియు 1912లో ఈ కాలేజ్లో తొలి మహిళా ఫెలోగా ఎంపికైన వ్యక్తి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement