స్థిరాస్తుల వివరాల నమోదులో చిక్కులెన్నో.. | Dharani Website Problems While Property Online | Sakshi
Sakshi News home page

స్థిరాస్తుల వివరాల నమోదులో చిక్కులెన్నో..

Oct 5 2020 1:52 AM | Updated on Oct 5 2020 7:48 AM

Dharani Website Problems While Property Online - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : స్థిరాస్తుల వివరాలన్నీ ఆన్‌లైన్‌లో నమోదు చేయా లన్న ప్రభుత్వ లక్ష్యానికి... క్షేత్రస్థాయిలో తలెత్తుతున్న సమ స్యలు అడ్డంకిగా మారుతున్నాయి. దసరా నాటికి ధరణి వెబ్‌సైట్‌ను అందుబాటులోకి తేవాలని ప్రభుత్వం నిర్ణయిం చింది. వ్యవసాయేతర కేటగిరీలో ఉన్న ఇళ్లు, ఇతర నిర్మాణా లను డిజిటలైజేషన్‌ చేస్తూ వెబ్‌సైట్‌లో అప్‌లోడ్‌ చేస్తోంది. ఈ సమయంలో పలురకాల సమస్యలు ఎదురవుతున్నాయి. వీటిని అధిగమించి వివరాలను ఎంట్రీ చేయడం యంత్రాం గానికి తలనొప్పిగా మారుతోంది. ఈ క్రమంలో ఆస్తుల నమోదు ప్రక్రియ నిర్దేశించిన గడువులోగా (ఈనెల 11వ తేదీలోగా) సాధ్యమయ్యే అవకాశాలు కనిపించడం లేదు.

అడుగడుగునా అడ్డంకులు
ధరణి వెబ్‌సైట్‌లో ఆస్తుల నమోదుకు సంబంధించి 40 రకాల అంశాలను పొందుపర్చాల్సి ఉంది. ప్రతి ఆస్తికి సం బంధించి యజమాని ఆధార్‌ కార్డు నంబర్, ఫోన్‌ నంబర్, భార్య/భర్త వివరాలు, వారి వారసుల పేర్లు, ఇళ్లు లేదా నిర్మాణం ముందు యజమాని లైవ్‌ ఫొటో దిగి ఆ వివరా లను వెబ్‌సైట్‌లో అప్‌లోడ్‌ చేయాల్సి ఉంటుంది. నిర్దేశించిన అంశాలన్నీ కుదిరితే ఒక ఆస్తిని అప్‌లోడ్‌ చేయడానికి కనిష్టంగా 10 నిమిషాలు పడుతుంది. ఏ సమాచారం లోపించినా ఆన్‌లైన్‌ నమోదు నిలిచిపోతోంది.

మరోవైపు ఈ నమోదు ప్రక్రియ గ్రామాల్లో మరింత అలస్యమవుతోంది. యజమాని అందుబాటులో ఉన్నప్పుడు ఇంటికెళ్లి వివరాలు ఎంట్రీ చేయడం ఇబ్బందిగా మారుతోంది. అంతేకాకుండా గ్రామాల్లో చాలా చోట్ల యజమానులు ఉపాధి కోసం పట్ట ణానికి వలస వెళ్లడంతో ఆయా ఇళ్లకు రోజుల తరబడి తాళాలే కనిపిస్తు న్నాయి. మరోవైపు ఒంటరి వ్యక్తికి సంబం ధించిన ఆస్తి నమోదు కఠినతర మవుతోంది. ఎందుకంటే ఆ వ్యక్తి సహచరి పేరు లేదా వారసుల పేర్లను తప్పకుండా ఎంట్రీ చేయాల్సి ఉం టుంది. కానీ ఒంటరి వ్యక్తి కావడంతో సదరు దరఖాస్తు అర్ధాంతరంగా నిలిచిపోతోంది.

  • ప్రతి ఆస్తికి యజమాని లైవ్‌ ఫొటోను జత చేయాల్సి ఉంటుంది. కానీ యజమాని అందుబాటులో లేకపోవ డంతో దరఖాస్తు ముందుకు సాగడం లేదు.
  • చాలాచోట్ల లైవ్‌ ఎంట్రీకి సాంకేతిక సమస్యలు ఎదురవు తున్నాయి. వివరాలను అప్‌లోడ్‌ చేసే సమయంలో సర్వర్‌ కనెక్ట్‌ కాకపోవడంతో వివరాల నమోదు తీవ్ర జాప్యమవుతోంది.
  • యజమాని వారసుల పేర్లతో పాటు వారి ఆధార్‌ వివరాలు కూడా ఎంట్రీ చేయాలి. అయితే కుటుంబ సమస్యలు, ఇతరత్రా కలహాలతో వారసుల పేర్లు, ఆధార్‌ వివరాలు సేకరించడం కష్టంగా మారుతోంది.
  • గ్రామాల్లో చాలాచోట్ల శిథిలావస్థకు చేరిన ఆస్తులు పెద్ద సంఖ్యలోనే ఉన్నాయి. యజమానులు వలస వెళ్లడంతో వారి వివరాలు తెలుసుకోవడం కష్టంగా మారింది.
  • కొన్నిచోట్ల అటవీ భూముల్లో ఇళ్లు ఉండగా.. ధరణి యాప్‌లో అటవీ భూముల ఆప్షన్‌ లేదు. దీంతో ప్రభుత్వ భూమిలోనిర్మాణమున్నట్లు నమోదు చేయాల్సి వస్తోంది. 

ఒక ఎన్యుమరేటర్‌కు రోజుకు 70 ఎంట్రీలే
ధరణి వెబ్‌సైట్‌లో ఆస్తుల వివరాల ఎంట్రీ కోసం నిర్దేశించిన ఎన్యుమరేటర్లకు ప్రభుత్వం ప్రత్యేక బడ్జెట్‌ కేటాయించింది. 30 ఆస్తులలోపు ఎంట్రీలు చేసే ఎన్యుమరేటర్‌కు ఒక్కో ఎంట్రీకి రూ.5 చొప్పున చెల్లింపులు చేస్తారు. 30 ఆస్తులకు మించి ఎంట్రీ చేస్తే ఒక్కో ఆస్తికి రూ.10 చొప్పున ఇస్తారు. ఒక ఎన్యుమరేటర్‌ ఒక రోజులో గరిష్టంగా 70 ఆస్తులను మాత్రమే ఎంట్రీ చేయాలి. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement