
చిట్యాల: కొడుకుల్లేరని ఆ దంపతులె ప్పుడూ బాధపడలేదు. కూతుళ్లను బాగా చదివించి.. విలువలతో పెంచారు. ఇప్పుడు వారే ఆ వృద్ధ తల్లిదండ్రులకు ఆసరాగా నిలుస్తున్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండల కేంద్రానికి చెందిన బుర్ర నర్సయ్య, సాంబలక్ష్మి దంపతులకు ఏడుగురు కుమార్తెలు. నర్సయ్య గతంలో సర్పంచ్‌గా పనిచేశారు. విలువలతో కూడిన రాజకీయం చేయడంతో ఆయన ఏమీ సంపాదించుకోలేకపోయారు.

కొద్ది నెలల క్రితం ఉన్న ఇల్లు సైతం వర్షానికి కూలిపోయింది. దీంతో వారు నాయకులను కలిసి ఇల్లు మంజూరు చేయాలని మొర పెట్టుకున్నారు. ప్రభుత్వం నుంచి ఎలాంటి పథకాలు అందకపోవడంతో.. ఆయన ఏడుగురు కుమార్తెలు తలా కొంత డబ్బులు వేసుకుని (రూ.5 లక్షలతో) తల్లిదండ్రులకు ఇల్లు కట్టి ఇచ్చారు. నర్సయ్య ఆదివారం గృహ ప్రవేశం చేశారు. తల్లిదండ్రుల రుణం తీర్చుకునేందుకు ఇల్లు కట్టించి ఇచ్చామని కూతుళ్లు చెబుతున్నారు.
అంబులెన్స్ రాలేదు.. స్నేహితుడు ప్రాణం నిలపాలని 40 కి.మీ. బైక్‌పై..
పుల్‌కల్(అందోల్): విషం తాగిన యువకుడిని ఆస్పత్రికి తరలించేందుకు ఫోన్ చేసినా 108 అంబులెన్సు రాలేదు.. దీంతో స్నేహితులే అతన్ని 40 కిలోమీటర్ల దూరం బైక్‌పై తరలించారు. కానీ ఆస్పత్రికి చేరేలోపే బాధితుని ఊపిరి ఆగిపోయింది. సంగారెడ్డి జిల్లా పుల్‌కల్ మండల పరిధిలో జరిగిన ఈ సంఘటన వివరాలివి. మండలంలోని బస్వాపూర్ గ్రామానికి చెందిన ఎర్రగొల్ల వెంకటేశం (32) ఆదివారం ఇంట్లో పురు గు మందు తాగి అపస్మారక స్థితికి చేరాడు.

గమనించిన కుటుంబ సభ్యులు, స్నేహి తులు 108 అంబులెన్స్‌కు ఫోన్ చేస్తూనే.. సమయాన్ని వృథా చేయకుండా ద్విచ క్రవాహనంపై యువకున్ని తీసుకెళ్లారు. మార్గమధ్యలో అంబులెన్స్ ఎదురైతే.. అందులో తరలించవచ్చని భావించి ఇద్దరు స్నేహితులు.. బైక్‌పై బాధితుడిని తరలించారు. కానీ సంగారెడ్డి ఆస్పత్రికి వెళ్లినా అంబులెన్స్ మాత్రం రాలేదు. వైద్యులు పరీక్షించి యువకుడు చనిపోయాడని చెప్పాడు. సమయానికి అంబులెన్స్ వస్తే యువకుడు బతికేవాడని స్నేహితులు, కుటుంబసభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు.