ఆక్స్‌ఫర్డ్‌ టీకా.. అందరికీ కష్టమే!

Coronavirus Vaccine Will Not Reach To Everyone Says Oxford - Sakshi

కోవిడ్‌ వ్యాక్సిన్‌ ధనిక, అభివృద్ధి చెందుతున్న దేశాలకే పరిమితం 

పేద, మధ్యతరగతి దేశాలకు అందడం గగనమే..

50% ప్రపంచానికి అందుబాటులో 12 శాతమే 

భారత్‌కు అత్యధిక వ్యాక్సిన్‌ డోసులు అవసరం 

‘గ్లోబల్‌ ప్రిపేర్డ్‌నెస్‌ బోర్డు’ నివేదికలో వెల్లడి

సాక్షి, హైదరాబాద్‌: కోవిడ్‌ మహమ్మారిని నిలువరించే వ్యాక్సిన్‌ ఎప్పటికి వస్తుందో నిర్దిష్టమైన అంచనాల్లేవు కానీ... ఆ వ్యాక్సిన్‌ వచ్చిన తర్వాత ఎన్ని దేశాలకు ఎన్ని డోసులు అవసరమవుతాయి, ఎన్ని దేశాలు ఈ వ్యాక్సిన్‌ ముందే కొనుగోలు చేసుకుంటాయి, ఎన్ని దేశాలు ఈ వ్యాక్సిన్‌ కూడా దొరక్క అవస్థలు పడతాయన్న దానిపై మాత్రం అంచనాలు ఓ కొలిక్కి వస్తున్నాయి. తాజాగా గ్లోబల్‌ ప్రిపేర్డ్‌నెస్‌ మానిటరింగ్‌ బోర్డు (జీపీఎంబీ) ఇచ్చిన నివేదిక ప్రకారం కోవిడ్‌ వ్యాక్సిన్‌ ఎప్పుడు వచ్చినా మొత్తం తయారయిన వ్యాక్సిన్‌ డోసుల్లో కేవలం 12 శాతం మాత్రమే 50 శాతం ప్రపంచానికి అందుబాటులో ఉంటాయట. ప్రపంచంలోని ఐదారు దేశాలు మిగతా 88 శాతం డోసులు కొనుగోలు చేసేస్తాయట. ఈ మేరకు ఆక్స్‌ఫర్డ్‌ వర్సిటీ, ఆస్ట్రాజెనెకా కంపెనీలతో ఆయా దేశాలు ఒప్పందాలు కూడా చేసేసుకున్నాయని జీపీఎంబీ నివేదిక వెల్లడించింది.  

భారత్‌కే ఎక్కువ 
జీపీఎంబీ నివేదిక ప్రకారం తొలిదశలో భాగంగా ప్రపంచ వ్యాప్తంగా తయారయ్యే కోవ్యాక్స్‌ (భారత్‌లో ఆక్స్‌ఫర్డ్‌ టీకాను కోవిషీల్డ్‌ పేరుతో విడుదల చేస్తారు) డోసుల్లో సింహభాగం భారతదేశానికి అవసరపడుతాయి. ఎంతగా అంటే మొత్తం తయారయ్యే వ్యాక్సిన్లలో 41శాతం డోసులు మనం కొనుగోలు చేసి సమకూర్చుకోవాల్సిందే. ఈ మేరకు భారత్‌తో పాటు పలు దేశాలు వ్యాక్సిన్‌ తయారీ కంపెనీలతో ఒప్పందాలు కూడా కుదుర్చుకున్నాయని ఆ నివేదిక వెల్లడించింది. దీని ప్రకారం భారత్‌ తర్వాత యూరోపియన్‌ యూనియన్, ఆ తర్వాత అమెరికా, చైనా, బ్రెజిల్, యూకే, ఆస్ట్రేలియా దేశాలు... ఎక్కువ డోసులు అవసరమయ్యే, కొనుగోలు ఒప్పందాలు కుదుర్చుకున్న జాబితాలో ఉన్నాయి.

ఈ లెక్క ప్రకారం ఈ ఆరు దేశాలు, ఈయూ కలిపి మొత్తం తయారయ్యే వ్యాక్సిన్‌ డోసుల్లో 88 శాతం తీసుకుంటే, ఇక మిగిలిన 50 శాతం ప్రపంచానికి అందుబాటు లో ఉండేది 12 శాతమేనంట. ఇదే నిజమైతే కోవిడ్‌ మహమ్మారిని అంతం చేయడం జరిగే పనికాదని, వ్యాక్సిన్లు అందుబాటులోకి తెచ్చుకోలేని దేశాల్లో ఇది మరింత ప్రబలి వ్యాక్సిన్లు సమకూర్చుకున్న దేశాలపైనా ప్రభావం చూపుతుందని జీపీఎంబీ నివేదిక వెల్లడించింది. అందుకే తాము కోవ్యాక్స్‌ పేరుతో ప్రపంచంలోని పేద, మధ్య తరగతి దేశాలకు తగినన్ని వ్యాక్సిన్‌ డోసులు పంపేలా ప్రయత్నం చేస్తున్నామని వెల్లడించింది.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter

మరిన్ని వార్తలు

26-10-2020
Oct 26, 2020, 10:02 IST
సాక్షి, న్యూఢిల్లీ: భారత్‌లో కరోనా వైరస్‌  విజృంభణ ఇంకా కొనసాగుతూనే ఉంది. దేశంలో కరోనా కేసుల సంఖ్య 79,09,000 దాటాయి. గడచిన...
26-10-2020
Oct 26, 2020, 08:27 IST
వాషింగ్టన్‌: తాను అధ్యక్షుడిగా ఎన్నికైతే అమెరికన్లందరికీ ఉచితంగా వాక్సిన్‌ అందిస్తానని డెమొక్రాటిక్‌ అభ్యర్ధి జోబైడెన్‌ హామీ ఇచ్చారు. తన సొంతరాష్ట్రం...
25-10-2020
Oct 25, 2020, 16:59 IST
సాక్షి, అమరావతి : గడిచిన 24 గంటల్లో 67,419 కరోనా వైరస్‌ శాంపిల్స్‌ను‌ పరీక్షించగా.. 2,997 మందికి‌ పాజిటివ్‌గా నిర్థారణ...
25-10-2020
Oct 25, 2020, 10:20 IST
సాక్షి, న్యూఢిల్లీ: భారత్‌లో గడిచిన 24 గంటల్లో 50,129 కరోనా వైరస్‌ పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల...
25-10-2020
Oct 25, 2020, 04:57 IST
గన్నవరం: కృష్ణా జిల్లా గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్‌ కరోనా బారినపడ్డారు. కొన్ని రోజులుగా గ్రామాల్లో పర్యటనలు, తర్వాత శ్రీవారి...
24-10-2020
Oct 24, 2020, 17:22 IST
సాక్షి, అమరావతి : ఏపీలో రికార్డు స్థాయిలో కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర వైద్యారోగ్యశాఖ హెల్త్‌ బులెటిన్‌లో పేర్కొంది.  రాష్ట్రంలో...
24-10-2020
Oct 24, 2020, 14:58 IST
సాక్షి, ముంబై: మహారాష్ట్రలో  కరోనా మహమ్మారి  బారిన పడుతున్న రాజకీయ నాయకులు సంఖ్య క్రమంగా పెరుగుతోంది. రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి,...
24-10-2020
Oct 24, 2020, 12:14 IST
కరోనా వ్యాక్సిన్‌పై ఎందుకు రాజకీయాలు చేస్తారు..?. టీకాపై ఒక్క బిహార్‌కే కాదు దేశం మొత్తానికి సమాన హక్కులు ఉన్నాయి.
24-10-2020
Oct 24, 2020, 10:46 IST
సమాచారం అందుకున్న పోలీసులు కోవిడ్‌ నిబంధనలు ఉల్లంఘించారంటూ ఆ బట్టల దుకాణాన్ని సీజ్‌ చేశారు.
24-10-2020
Oct 24, 2020, 09:54 IST
దేశంలో కరోనా రోగులకు ప్లాస్మా థెరపీ చికిత్స ద్వారా పెద్దగా ఫలితం లేదని బ్రిటీష్‌ మెడికల్‌ జర్నల్‌ తెలిపింది.
24-10-2020
Oct 24, 2020, 07:32 IST
సా​‍క్షి, హిమాయత్‌ నగర్‌:  మన ఒంటి శుభ్రమే కాదు. చేతుల శుభ్రం కూడా చాలా ముఖ్యం. రోజూ మనం ఎంతోమందిని...
24-10-2020
Oct 24, 2020, 06:09 IST
ఏడాది చివర్లోగా వ్యాక్సిన్‌ మార్కెట్‌లో విడుదల అవతుందని ఆశిస్తున్నామన్నారు. ఆశుభ ఘడియ రాగానే ప్రభుత్వమే పూర్తి ఖర్చును భరించి రాష్ట్ర...
24-10-2020
Oct 24, 2020, 04:36 IST
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఒకేరోజు రికార్డు స్థాయిలో 80,238 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. కరోనా వచ్చినప్పట్నుంచి ఇదే ఆల్‌టైమ్‌...
23-10-2020
Oct 23, 2020, 19:35 IST
సాక్షి, అమరావతి :  ఏపీలో గడిచిన 24 గంటల్లో 80,238 కరోనా సాంపిల్స్‌ పరీక్షలు నిర్వహించగా.. 3,765 మందికి కోవిడ్‌ పాజిటివ్‌గా...
23-10-2020
Oct 23, 2020, 15:28 IST
బెంగళూరు: కరోనా మహమ్మారి గురించి రోజుకొక షాకింగ్‌ న్యూస్‌ వెలుగులోకి వస్తోంది. తాజాగా ఇలాంటి వార్త మరొకటి తెలిసింది. కరోనాతో...
23-10-2020
Oct 23, 2020, 14:27 IST
కోవిడ్‌ పరిస్థితుల నేపథ్యంలో స్థానిక సంస్థల ఎన్నికలను ఈ నవంబర్‌లో నిర్వహించే పరిస్థితి లేదని మంత్రి గౌతమ్‌రెడ్డి‌ అన్నారు.
23-10-2020
Oct 23, 2020, 11:01 IST
కరోనా వ్యాక్సిన్ తయారీలో దేశీయ సంస్థ సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (ఎస్ఐఐ) భారీ సన్నాహాలు ప్రారంభించింది. 
23-10-2020
Oct 23, 2020, 10:20 IST
సాక్షి, న్యూఢిల్లీ: భారత్‌లో గడిచిన 24 గంటల్లో 54,366 కరోనా వైరస్‌ పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల...
23-10-2020
Oct 23, 2020, 09:35 IST
సాక్షి, ముంబై: ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ వ్యాక్సిన్ కోసం వేయి కళ్లతో ఎదురుచూస్తున్న వేళ ప్రపంచంలోనే అతిపెద్ద టీకా తయారీ సంస్థ...
22-10-2020
Oct 22, 2020, 18:41 IST
సాక్షి,అమరావతి : ఏపీలో కరోనా పరీక్షలు రికార్డు స్థాయిలో కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర వైద్యారోగ్యశాఖ గురువారం విడుదల చేసిన హెల్త్‌...
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top