కరోనా వ్యాక్సిన్‌: పరిమిత జాప్యం పర్వాలేదు!  

Corona Vaccine Delayed Second Dose - Sakshi

దేశంలో కోవిడ్‌ వ్యాక్సినేషన్‌పై డబ్ల్యూహెచ్‌వో స్పష్టత 

కోవిషీల్డ్‌ రెండో డోసుకు 6–12 వారాల గడువు 

కోవాగ్జిన్‌ రెండో డోసును 4–6 వారాల్లో వేసుకోవచ్చు 

గడువు దాటితే వ్యాక్సిన్‌ వృథా అనేది అవాస్తవం 

తొలిడోసు తీసుకున్న 14 రోజులకు యాంటీ బాడీస్‌ వృద్ధి 

నాలుగు వారాల తర్వాత ప్రొటెక్షన్‌ ఇచ్చే స్థాయికి.. 

 రెండో డోసుతో యాంటీబాడీలకు డబుల్‌ బూస్టింగ్‌

సాక్షి, హైదరాబాద్‌:  ‘కరోనా వ్యాక్సిన్‌ తొలి డోసు తీసుకున్నాక రెండో డోసు తీసుకోవడం ఆలస్యమైతే వృథా అవుతుందా? నిర్దిష్ట గడువు దాటాక రెండో డోసు తీసుకుంటే సరైన ఫలితం ఉంటుందా? రెండో డోసు తీసుకున్నాకే శరీరానికి వైరస్‌ నుంచి రక్షణ అందుతుందా?’.. దేశంలో వ్యాక్సిన్ల కొరత, టీకాల కార్యక్రమం ఆలస్యం అవుతున్న నేపథ్యంలో తలెత్తుతున్న ప్రశ్నలివి. టీకాల కొరత కారణంగా రెండో డోసు తీసుకోవాల్సిన వారికి.. ముందుగా చెప్పిన సమయం కంటే ఎక్కువ ఆలస్యమవుతోంది. అయితే పరిమిత ఆలస్యం వల్ల నష్టమేమీ లేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) చెప్తోంది. వివిధ దేశాల్లో పంపిణీ చేస్తున్న కోవిడ్‌ వ్యాక్సిన్లకు సంబంధించి ఇటీవల విడుదల చేసిన నివేదికలో.. మన దేశంలో వినియోగిస్తున్న కోవాగ్జిన్, కోవిషీల్డ్‌ వ్యాక్సిన్లకు సంబంధించిన అంశాలను ప్రస్తావించింది. 

కోవిషీల్డ్‌కు మూడు నెలల దాకా.. 
రాష్ట్రంలో కరోనా వ్యాక్సినేషన్‌లో భాగంగా కోవాగ్జిన్, కోవిషీల్డ్‌ టీకాలు ఇస్తున్నారు. వ్యాక్సిన్ల లభ్యత ఆధారంగా ఈ ఏడాది జనవరి 16 నుంచి పంపిణీ ప్రక్రియ మొదలైంది. రెండు టీకాలు కూడా నిర్ణీత విరామంతో రెండు డోసులుగా వేసుకోవాల్సి ఉంటుంది. ఇందులో కోవిషీల్డ్‌ వ్యాక్సిన్‌ తొలి డోసు తీసుకున్నాక.. 6–8 వారాల విరామంతో రెండో డోసు తీసుకోవాలని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ సూచించింది. అయితే డబ్ల్యూహెచ్‌వో మాత్రం 6 నుంచి 12వారాల విరామం ఉన్నా నష్టం లేదని వెల్లడించింది. కోవిషీల్డ్‌ వ్యాక్సిన్‌ను భారత్‌లోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాల్లో కూడా వినియోగిస్తున్నారు. ఈ క్రమంలోనే కోవిషీల్డ్‌ తొలి డోసు తీసుకున్నాక మూడు నెలల విరామం వరకు రెండో డోసు వేసుకోవచ్చని డబ్ల్యూహెచ్‌వో వివరించింది. అదే విధంగా కోవాగ్జిన్‌ టీకా తొలిడోసు తీసుకున్నాక 4 నుంచి 6 వారాల విరామంతో తీసుకోవచ్చని సూచించింది. 

తొలి డోసు నుంచే రక్షణ మొదలు 
కోవిడ్‌ వ్యాక్సిన్లు తొలి డోసు తీసుకున్న రెండువారాల తర్వాత శరీరానికి రక్షణ మొదలవుతుంది. శరీరంలో యాంటీబాడీల వృద్ధి రెండు వారాల తర్వాత ప్రారంభమవడమే దీనికి కారణం. ఇక తొలి డోసు తీసుకున్న నాలుగు వారాల నుంచి యాంటీబాడీలు వైరస్‌ నుంచి ప్రొటెక్షన్‌ ఇచ్చే స్థాయికి ఎదగడం మొదలవుతుంది. రెండో డోసు తీసుకున్నాక యాంటీబాడీలకు డబుల్‌ బూస్టింగ్‌ వస్తుంది. వైరస్‌ నుంచి రెట్టింపు రక్షణ ఏర్పడుతుందని డబ్ల్యూహెచ్‌వో తమ నివేదికలో పేర్కొంది. కొన్ని సందర్భాల్లో శరీర స్థితి ఆధారంగా యాంటీ బాడీల పెరుగుదల ఉంటుందని వివరించింది. ఇక ఆలస్యంగా రెండో డోసు తీసుకుంటే ఫలితం ఉండదనేది అవాస్తవమని డబ్ల్యూహెచ్‌వో స్పష్టం చేసింది. రెండో డోసుకు నిర్దేశించిన గడువు నాలుగైదురోజులు అటూ ఇటూ అయినా తప్పకుండా వ్యాక్సిన్‌ తీసుకోవాలని సూచిస్తోంది. 

2–4 వారాల మధ్యే యాంటీబాడీల వృద్ధి 
‘వ్యాక్సిన్‌ వేసుకున్నాక రెండు నుంచి నాలుగు వారాల మధ్య యాంటీబాడీల వృద్ధి ప్రారంభమవుతుంది. వాటి సంఖ్య, సామర్థ్యం మరింతగా పెంచేందుకు రెండో డోసు వేసుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుతం వ్యాక్సిన్ల కొరతతో రెండో డోసు తీసుకోవడంలో కాస్త ఆలస్యం అవుతోంది. దేశంలో ప్రస్తుతం ఇస్తున్న రెండు రకాల వ్యాక్సిన్ల రెండో డోసుకు ఐసీఎంఆర్‌ వేర్వేరు గడువును విధించింది. నిర్దేశించిన గడువుకు కాస్త అటుఇటైనా వ్యాక్సిన్‌ పనితీరు బాగానే ఉంటుంది. అయితే ఈ అంశంపై ఇంకా విస్తృత పరిశోధనలు జరుగుతున్నాయి’. 
– డాక్టర్‌ పి.విజయ నరసింహారెడ్డి, అసిస్టెంట్‌ ప్రొఫెసర్, జనరల్‌ మెడిసిన్‌ డిపార్ట్‌మెంట్, జీజీహెచ్, కడప

రెండో డోసు తప్పనిసరి 
‘కోవిడ్‌–19 వ్యాక్సిన్లన్నీ రెండు డోసులు ఇస్తున్నారు. మన దగ్గర కూడా రెండో డోసు వేసుకోవాలని ఐసీఎంఆర్‌ స్పష్టం చేసింది. అయితే నిర్ధిష్ట కాల పరిమితి విధించి ఆలోపు రెండో డోసు తీసుకోవాలని సూచిస్తున్నప్పటికీ.. ప్రస్తుత పరిస్థితులను చూస్తుంటే ఆలస్యం కాక తప్పేలా లేదు. అయినప్పటికీ రెండో డోసు వేసుకుంటే యాంటీబాడీలకు బూస్టింగ్‌ వస్తుంది. అందువల్ల రెండో డోసు పట్ల నిర్లక్ష్యం చూపకుండా వేసుకోవాలి’. 
– డాక్టర్‌ కిరణ్‌ మాదల, అసోసియేట్‌ ప్రొఫెసర్, ప్రభుత్వ వైద్య కళాశాల, నిజామాబాద్‌   

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వార్తలు

13-05-2021
May 13, 2021, 03:24 IST
సాక్షి, గాంధీ ఆస్పత్రి: బాబోయ్‌ కరోనా అంటూ యువతే బయపడుతున్న వేళ.. 110 యేళ్ల తాత ధైర్యంగా వైరస్‌ను జయించాడు. ఇప్పటివరకు...
13-05-2021
May 13, 2021, 03:11 IST
సాక్షి, హైదరాబాద్‌: కరోనాకు స్పష్టమైన చికిత్స లేదు. శాస్త్రీయంగా రుజువులు ఉన్న మందులను చికిత్సకు ఉపయోగిస్తున్నారు. అయితే భారత్‌లో కొందరు...
13-05-2021
May 13, 2021, 02:46 IST
సాక్షి ముంబై: మహారాష్ట్రలో మే 31వ తేదీ వరకు లాక్‌డౌన్‌ ఆంక్షలు పొడిగించనున్నట్లు తెలిసింది. ముఖ్యమంత్రి ఉద్దవ్‌ ఠాక్రే అధ్యక్షతన...
13-05-2021
May 13, 2021, 02:26 IST
సాక్షి నెట్‌వర్క్‌:  రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో తొలి రోజు లాక్‌డౌన్‌ పకడ్బందీగా జరిగింది. ఉదయం ఆరు నుంచి పది గంటల...
13-05-2021
May 13, 2021, 01:58 IST
సాక్షి, హైదరాబాద్‌: ప్రజల ప్రాణాలు కాపాడేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకునేందుకు సిద్ధంగా ఉన్నామని రాష్ట్ర పురపాలక, పరిశ్రమల శాఖ...
13-05-2021
May 13, 2021, 01:37 IST
సాక్షి, హైదరాబాద్‌: కరోనా కట్టడి కోసం రాష్ట్ర ప్రభుత్వం విధించిన లాక్‌డౌన్‌ తొలి రోజు బుధవారం ప్రశాంతంగా ముగిసింది. ఉదయం...
13-05-2021
May 13, 2021, 01:34 IST
న్యూఢిల్లీ: దేశంలోని ప్రజలను పట్టించుకోకుండా విదేశాలకు వ్యాక్సిన్లను పంపడంపై ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తున్న నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ అధికార...
13-05-2021
May 13, 2021, 00:51 IST
న్యూఢిల్లీ: బిహార్‌లోని గంగా నదిలో భారీ సంఖ్యలో కరోనా బాధితుల మృతదేహాలు కొట్టుకురావడం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. గంగా పరీవాహక...
13-05-2021
May 13, 2021, 00:49 IST
భారత్‌లో కనీవినీ ఎరుగని విధ్వంసానికి కారణమవుతున్న కొత్త రకం కరోనా వైరస్‌ వెనక ఉన్న అసలు వాస్తవాన్ని అంచనా వేస్తున్నదానికంటే...
13-05-2021
May 13, 2021, 00:30 IST
దేశంలో కోవిడ్‌ టీకామందు (వాక్సిన్‌) అవసరం, కొరత తీవ్ర స్థాయికి చేరింది. పలు రాష్ట్ర ప్రభు త్వాలను ఆందోళనకు గురిచేస్తోంది....
12-05-2021
May 12, 2021, 21:45 IST
సాక్షి, హైదరాబాద్‌: హైదరాబాద్‌లో బుధవారం మంత్రి కేటీఆర్ అధ్యక్షతన కరోనా టాస్క్‌ఫోర్స్‌ కమిటీ సమావేశం అయ్యింది. ఈ సమావేశానికి  సీఎస్, వివిధ శాఖల...
12-05-2021
May 12, 2021, 20:47 IST
ముంబై: కరోనా పాజిటివ్‌ అని తెలియగానే తాను చాలా భయపడిపోయానని ఎస్‌ఆర్‌హెచ్‌ వికెట్‌ కీపర్‌ వృద్ధిమాన్‌ సాహా పేర్కొన్నాడు.  ఈ సీజన్‌లో...
12-05-2021
May 12, 2021, 18:58 IST
సాక్షి, అమరావతి: గత 24 గంటల్లో ఆంధ్రప్రదేశ్‌లో 90,750 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 21,452 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్థారణ అయ్యింది. ఇప్పటివరకు రాష్ట్రంలో 13,44,386...
12-05-2021
May 12, 2021, 17:20 IST
ప్రాణాలు కోల్పోవడం కన్నా మాస్క్‌ ధరించడం ఏంతో మేలు
12-05-2021
May 12, 2021, 16:27 IST
న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి నుంచి ప్రజలను కాపాడేందుకు వైద్యులు, వైద్య సిబ్బంది నిరంతరం శ్రమిస్తున్నారు. ఈ క్రమంలో ముంబైలోని డాక్టర్‌ దంపతులు...
12-05-2021
May 12, 2021, 16:14 IST
సాక్షి, న్యూఢిల్లీ: భారత్‌లో బయటపడిన కరోనా వైరస్‌ బి-1617 రకాన్ని ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌ఓ) ఆందోళనకరమైన స్ట్రెయిన్‌గా వర్గీకరించిందంటూ నిన్నంత...
12-05-2021
May 12, 2021, 16:13 IST
ముంబై: టీమిండియా మాజీ క్రికెటర్‌ ఆర్పీ సింగ్‌ తండ్రి శివప్రసాద్‌ సింగ్‌ కరోనాతో పోరాడుతూ బుధవారం కన్నుమూశారు. ఆర్పీ సింగ్‌ ఐపీఎల్‌...
12-05-2021
May 12, 2021, 15:53 IST
లండన్:  గత సంవత్సర కాలంగా ప్రపంచ దేశాలను కరోనా మహమ్మారి పట్టి పీడిస్తున్న సంగతి తెలిసిందే. ఈ వైరస్‌ అడ్డుకట్టకు వ్యాక్సినేషన్‌ ఒక్కటే మార్గమని భావించి ఆయా దేశాల శాస్త్రవేత్తలు వాళ్ల ప్రయత్నాలను...
12-05-2021
May 12, 2021, 15:22 IST
సాక్షి, న్యూఢిల్లీ: ‘‘ఇచ్చిపుచ్చుకునే ధోరణిలోనే భారత్‌ ఇతర దేశాలకు వ్యాక్సిన్ పంపింది. దానికి బదులుగా టీకా తయారీకి అవసరమైన ముడి సరుకులు...
12-05-2021
May 12, 2021, 14:20 IST
సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీలో కరోనా సెకండ్‌ వేవ్‌ కల్లోలం కొనసాగుతోంది. భారీ సంఖ్యలో బాధితులు ఆసుపత్రులకు క్యూకడుతున్నారు. ఆక్సిజన్‌ కొరతతో...
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top