ఇక ఠంచనుగా ఆస్పత్రికి..

Collector Sending Collectorate Staff To Hospitals To Monitor Doctor Attendance - Sakshi

ఆస్పత్రుల్లో వైద్యుల గైర్హాజరు తీరుపై ‘సాక్షి’కథనాలకు స్పందన 

ఆస్పత్రులకు కలెక్టరేట్‌ సిబ్బందిని పంపి పర్యవేక్షిస్తున్న కలెక్టర్‌

నిర్మల్‌: నిర్మల్‌లోని జిల్లా ఆస్పత్రి, ప్రసూ తి ఆస్పత్రులతో పాటు భైంసాలోని ఏరియా ఆస్పత్రిలో వైద్యులు పక్కాగా సమయపాలన పాటిస్తున్నారు. కలెక్టరేట్‌ నుంచి ఈ మూడు ఆస్పత్రులకు రోజూ ఉదయం 9గంటలకు, మధ్యాహ్నం 2గంటలకు కలెక్టర్‌ ముషరఫ్‌ అలీ తన సిబ్బందిని పంపించి వైద్యుల హాజరుపై పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. వారి రిజిస్టర్‌లో విధుల్లో ఉన్న వైద్యు లతో స్వయం గా సంతకాలు పెట్టిస్తున్నారు. కలెక్టర్‌ చర్యల తో ఆస్పత్రుల్లో సమయానికి వైద్యులు వస్తుండటం, సేవలు అందుతుండటంతో జిల్లావాసు లు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సర్కారు దవా ఖానాల్లో వైద్యుల గైర్హాజరీపై ‘సాక్షి’పలుమార్లు కథనాలను ప్రచురించిన సంగతి తెలిసిందే.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top