CMR Is Delayed Because Of FCI - Sakshi
Sakshi News home page

ఎఫ్‌సీఐ వల్లే సీఎంఆర్‌ ఆలస్యం

Jul 26 2023 3:34 AM | Updated on Jul 26 2023 9:20 PM

CMR is delayed because of FCI - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఎఫ్‌సీఐ వ్యవహరిస్తున్న తీరుతో రాష్ట్రంలో మిల్లింగ్‌ ఇండస్ట్రీ తీవ్ర ఇబ్బందులు ఎదు ర్కొంటోందని రాష్ట్ర రైస్‌ మిల్లర్ల సంఘం ఆందోళన వ్యక్తం చేసింది. సీఎంఆర్‌ విషయంలో మిల్లర్లను వేధించడ మే లక్ష్యంగా ఎఫ్‌సీఐ అధికారులు నిబంధన లకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని మిల్లర్ల సంఘం అధ్యక్షుడు గంప నాగేందర్‌ గుప్తా ఆరోపించారు.

మంగళవారం నగరంలోని టూరిస్ట్‌ ప్లాజాలో మిల్లర్ల సంఘం సమావే శం జరిగింది. అనంతరం ఆయన మీడియా తో మాట్లాడారు. మిల్లర్లు మిల్లింగ్‌ చేసిన ధాన్యాన్ని ఎప్పటికప్పుడు గోడౌన్‌ల నుంచి తరలించాల్సిన ఎఫ్‌సీఐ నాలుగైదు నెలలైనా రైల్వే వ్యాగన్ల ద్వారా ఇతర రాష్ట్రాలకు పంపడం లేదని, తద్వారా గోడౌన్‌లు నిండి పోయి మిల్లింగ్‌ జరగని పరిస్థితి నెలకొందని వివరించారు.

ఒక్కో ఎఫ్‌సీఐ గోడౌన్‌కు వందలాది మిల్లుల నుంచి వచ్చిన బియ్యాన్ని కేటాయిస్తుండడంతో వారం రోజులైనా బియ్యం లారీలు అన్‌లోడింగ్‌ కావడం లేదన్నారు. దీంతో సమయానికి సీఎంఆర్‌ ఇవ్వలేని పరిస్థితి నెలకొందన్నారు.

ఇలాగైతే మిల్లింగ్‌ ఎలా?
ప్రస్తుతం రాష్ట్రంలోని మిల్లర్ల వద్ద కోటి మె ట్రిక్‌ టన్నుల ధాన్యం నిల్వలు ఉన్నాయని, ఎఫ్‌సీఐ ఇలాగే వ్యవహరిస్తే ఈ ధాన్యాన్ని మిల్లింగ్‌ చేయడం అసాధ్యమని గుప్త స్పష్టం చేశారు. ఎఫ్‌సీఐ కారణంగా 70 లక్షల మెట్రి క్‌ టన్నుల ధాన్యం మిల్లింగ్‌ చేయడానికి 24 నెలల కాలం పడుతుందన్నారు.

మిల్లర్లకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి రూ.700 కోట్లు, ఎఫ్‌సీఐ నుంచి రవాణా చార్జీలు రూ.700 కోట్లు రావలసి ఉందని, వాటిని వెంటనే చె ల్లించాలని ఆయన డిమాండ్‌ చేశారు. కేంద్రం పంపించే బలవర్ధక బియ్యం కెర్నల్స్‌ (ఎఫ్‌ ఆర్‌కే)లో  నాణ్యత లేదని మిల్లులను ఎఫ్‌సీఐ డిఫాల్టర్లుగా ప్రకటించడం శోచనీయమన్నారు. సమావేశంలో సంఘం కార్యనిర్వాహక అధ్యక్షుడు ప్రభాకర్‌ రావు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement