
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ఎడతెరిపిలేని వర్షాలు కురుస్తున్నాయి. పలు జిల్లాలో ఏకధాటిగా కురుస్తున్న వానలకు జన జీవనం అస్తవ్యస్తమైంది. ఇళ్లలోకి వరద నీరు చేరింది. పంటలకు తీవ్ర నష్టం కలిగింది. మరోవైపు.. భారీ వర్షాల నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. నేడు వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలించనున్నారు. ఉదయం 11 గంటలకు ఏరియల్ సర్వే ద్వారా మెదక్, కామారెడ్డి, నిజామాబాద్ , నిర్మల్, సిరిసిల్ల జిల్లాలను సీఎం పరిశీలించనున్నారు. ఇక, కామారెడ్డిలో ముంపు ప్రాంతాల పరిశీలనకు ఇంఛార్జి మంత్రి సీతక్క, పీసీసీ ఛీఫ్ మహేష్ కుమార్ గౌడ్ వెళ్లనున్నారు.