కాళేశ్వరం చేరుకున్న సీఎం కేసీఆర్‌

CM KCR visits Kaleshwaram and Barrage also - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: కాళేశ్వరం ప్రాజెక్ట్‌ పరిశీలన కోసం తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ కాళేశ్వరం చేరుకున్నారు. హైదరాబాద్‌ నుంచి ప్రత్యేక హెలికాప్టర్‌లో మంగళవారం ఉదయం బయల్దేరారు. కాళేశ్వరం చేరుకుని నేరుగా కాళేశ్వర.. ముక్తేశ్వర స్వామివార్ల దర్శనానికి వెళ్లారు. సీఎం కేసీఆర్, శోభ దంపతులు, మంత్రులకు వేద పండితులు ఘన స్వాగతం పలికి ఆలయం లోపలకు తీసుకెళ్లారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు చేసిన అనంతరం ప్రాజెక్ట్‌ పరిశీలనకు వెళ్లారు. యాసంగి సీజన్‌లో కాళేశ్వరం ద్వారా.. నీటిని పంపించే విధానాన్ని పరిశీలించేందుకు సీఎం కేసీఆర్‌ ఈ పర్యటన చేపట్టారు.

కాళేశ్వరం ప్రాజెక్ట్‌లోని ప్రధాన బ్యారేజ్‌లు పరిశీలించిన అనంతరం అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు. యాసంగి సీజన్‌లో పంటలకు జలాలను పంపింగ్‌చేస్తున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు కాళేశ్వరంలో పర్యటిస్తున్నారు.  అక్కడి నుంచి హెలికాప్టర్‌లో కాళేశ్వరం రిజర్వాయర్‌ను పరిశీలిస్తారు. లక్ష్మీ బరాజ్‌ చేరుకొని.. అక్కడ అధికారులతో సమీక్ష నిర్వహిస్తారు. యాసంగి పంటలకు సరిపడా సాగునీటిని అందించడమే లక్ష్యంగా సీఎం కేసీఆర్‌ అధికారులకు తగిన ఆదేశాలు ఇస్తారు. ఈ సందర్భంగా మీడియాతో ముఖ్యమంత్రి మాట్లాడే అవకాశం ఉంది. బ్యారేజ్‌ వద్ద సీఎం కేసీఆర్‌ భోజనం చేసి అక్కడి నుంచి హెలిక్యాప్టర్‌లో హైదరాబాద్‌కు తిరిగి వెళ్లనున్నారు. సీఎం వెంట ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాల మంత్రులు, ఎమ్మెల్యేలు, కలెక్టర్లు, సాగునీటి అధికారులు ఉన్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top