 
													సాక్షి, హైదరాబాద్ : ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్‌రావు శుక్రవారం రాజ్‌భవన్‌కు వెళ్లారు. రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందర్‌రాజన్ భర్త , ప్రముఖ నెఫ్రాలజిస్ట్ సౌందర్‌రాజన్‌కు ధన్వంతరి అవార్డు వచ్చిన నేపథ్యంలో ఆయనను ముఖ్యమంత్రి అభినందించారు. అనంతరం శాలువాతో సత్కరించి, జ్ఞాపికను అందచేశారు. సీఎం కేసీఆర్‌తో పాటు ఆయన కుమార్తె కవిత కూడా ఉన్నారు. అంతకు ముందు ముఖ్యమంత్రికి గవర్నర్ ఆహ్వానం పలికారు.

గవర్నర్ డా. తమిళిసై సౌందరరాజన్ భర్త, ప్రముఖ నెఫ్రాలజిస్ట్, బెస్ట్ మెడికల్ టీచర్, డాక్టర్ సౌందరరాజన్ కు ధన్వంతరి అవార్డు వచ్చిన నేపథ్యంలో ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు ఇవాళ రాజ్ భవన్ లో డాక్టర్ సౌందరరాజన్ ను కలిసి ఘనంగా సన్మానించి అభినందించారు.@DrTamilisaiGuv pic.twitter.com/FUfxAGC4AA
— Telangana CMO (@TelanganaCMO) October 2, 2020

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
