కేంద్రంతో గలాటానే.. అందుకు సిద్ధంగా ఉన్నాం: సీఎం కేసీఆర్‌

CM KCR Comments On PM Narendra Modi - Sakshi

తెలంగాణపట్ల మోదీ ప్రభుత్వం చిన్నచూపు చూస్తోంది

రాష్ట్ర సమస్యలను వినేందుకూ ఆసక్తి చూపట్లేదు

సమైక్య రాష్ట్రంలో తెలంగాణ తీవ్ర నిర్లక్ష్యానికి గురైంది

శక్తిపీఠాల్లో ఒకటైన జోగుళాంబ ఆలయానికి నాడు ప్రచారం కల్పించలేదు

స్వరాష్ట్రంలో పరిస్థితి మారింది.. అన్ని రంగాల్లో ముందున్నాం

ఇక పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేసుకుందాం

విశేష స్థలాలు, టూరిస్టు ప్రాంతాలను కలుపుతూ సర్క్యూట్‌కు చర్యలు

మోదీతో గొడవ పెట్టుకున్నా...
ఇటీవల ఢిల్లీలో ప్రధానిని కలిసినప్పుడు రాష్ట్రంపై మోదీ నిర్లక్ష్య వైఖరితో ఉండటాన్ని చూసి ఆగలేక పోయా. అక్కడే గొడవ పెట్టుకున్నా. రాష్ట్రం నుంచి పద్మ అవార్డుల కోసం ప్రతిపాదనలు పం పాలా వద్దా అని నిలదీశా. ఎన్నిసార్లు పంపినా ఖాతరు చేయట్లేదు. రాష్ట్రంలో కళాకారులు, ప్రతిభా వంతులు లేరా? అని అమిత్‌ షానూ నిలదీశా’

ఆరున్నరేళ్లయినా ఎయిర్‌స్ట్రిప్స్‌ ఊసేదీ?
వరంగల్, ఆదిలాబాద్‌ తదితర ప్రాంతాల్లో ఎయిర్‌ స్ట్రిప్స్‌ ఇవ్వాలని కేంద్రాన్ని కోరి ఆరున్నరేళ్లు గడు స్తోంది. కానీ ఇప్పటికీ కేంద్రం ఆ ఊసే ఎత్తట్లేదు. సాంకేతిక కారణాలను సాకుగా చూపుతూ జాప్యం చేస్తోంది. ఎయిర్‌ స్ట్రిప్స్‌ ఇస్తే మా పనులు మేం చేసుకుంటామన్నా వినకపోవడం సరికాదు.

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రాభివృద్ధి విషయంలో నిర్లక్ష్యం వహిస్తున్న కేంద్ర ప్రభుత్వంపై గలాటా చేసేందుకు సిద్ధంగా ఉన్నామని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అన్నారు. రాష్ట్రానికి సంబంధిం చిన వివిధ అంశాలను కేంద్రం దృష్టికి తీసుకెళ్లేం దుకు ప్రయత్నించానని, కానీ తెలంగాణపై కేంద్రం చిన్నచూపు చూస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. సమైక్య రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతం తీవ్ర అన్యా యానికి గురైందని, ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించుకొని అభివృద్ధి చేసేందుకు అహర్నిశలు కృషి చేస్తున్నా మన్నారు. శాసనసభ సమావేశాల్లో భాగంగా సోమవారం ఉదయం ప్రశ్నోత్తరాల సమయంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ మాట్లాడారు.

నాడు ‘జోగుళాంబ’ను పట్టించుకోలేదు..
‘తెలంగాణ రాష్ట్రం ఉజ్వలమైన చరిత్రకు సాక్షీభూతం. గొప్ప సంస్కృతి, సంప్రదాయాలకు నిలువెత్తు నిదర్శనం. అద్భుతమైన అటవీ అం దాలు, సుందరమైన జలపాతాలు, వారసత్వ కట్ట డాలు, దేవాలయాలు, కోటలు, గడీలు, బురుజులు, చారిత్రక అవశేషాలు రాష్ట్రంలో ఉన్నాయి. 58 ఏళ్ల సమైక్య పాలనలో అన్ని అంశాల్లో తెలంగాణ తీవ్ర నిర్లక్ష్యానికి గురైంది. ముఖ్యంగా పర్యాటక రంగానికి అద్భుత అవకాశాలున్నా ఎవరూ పట్టిం చుకోలేదు. దేశంలోని అష్టాదశ శక్తిపీఠాల్లో జోగుళాంబ ఆలయం ఒకటి. అంతటి శక్తివంతమైన

ఆలయానికి సమైక్య రాష్ట్రంలో గుర్తింపు దక్కలేదు. అప్పటి ప్రభుత్వం ఏమాత్రం ప్రచారం కల్పించ లేదు. ఉద్యమంలో భాగంగా శక్తిపీఠాన్ని దర్శించు కొని ఆ తర్వాత జోగుళాంబ నుంచి గద్వాల వరకు పాదయాత్ర చేశా. కృష్ణా, గోదావరి పుష్కరాల విష యంపైనా నేను కొట్లాడా.ఇది వరకు ఎస్సారెస్పీ నుంచి గోదావరి మొదలైతే నేరుగా ధవళేశ్వరంలో కలిసేది. ఇప్పుడు రాష్ట్రంలో 160 కి.మీ. మేర గోదావరి సజీవంగా ప్రవహిస్తోంది. ఈ ప్రయాణం లో ఎన్నో అద్భుతాలను చూడొచ్చు. రామప్పకు గౌరవం దక్కింది’ అని సీఎం కేసీఆర్‌ పేర్కొన్నారు.

విశేష స్థలాలుంటే ప్రతిపాదించండి...
పర్యాటక అభివృద్ధిలో భాగంగా అన్ని ప్రాంతాలకు ప్రాధాన్యత ఇస్తామని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు స్పష్టం చేశారు. ‘శాసనసభ్యులు తమ పరిధిలోని విశేష స్థలాలు, దేవాలయాల సమాచారాన్ని పర్యాటక మంత్రికి ప్రదిపాదనలతో కూడిన వినతి పత్రాలను అందజేయాలి. చారిత్రక నేపథ్యమున్న వాటికి తొలి ప్రాధాన్యత ఇవ్వాలి. వాటిని ప్రధాన టూరిజం స్పాట్‌లతో కలుపుతూ సర్క్యూట్‌ రూపొందించేందుకు చర్యలు తీసుకుందాం. శాసనసభ్యుల నుంచి వచ్చిన వినతులను పరిశీలించేందుకు రాష్ట్ర స్థాయిలో ఒక కమిటీని ఏర్పాటు చేస్తాం. అవసరమైతే కమిటీ బృందం క్షేత్రస్థాయిలో పర్యటించి అక్కడి ప్రాశస్త్యాన్ని గుర్తించి పర్యాటక అభివృద్ధికి చర్యలు తీసుకుంటుంది. వీలైనంత త్వరగా ప్రతిపాదనలను శాఖ మంత్రికి అందించండి’ అని సీఎం సభలో సభ్యులకు వివరించారు. రాష్ట్రంలోని చారిత్రక విశేషాలను తెలుసుకునేందుకు విదేశీ పర్యాటకుల తాకిడి పెరిగిందని, దీంతో రాష్ట్రంలో విమానయాన రంగం అభివృద్ధికి తమ ప్రభుత్వం కృషి చేస్తోందని సీఎం కేసీఆర్‌ తెలిపారు.

రామప్ప చుట్టూ అభివృద్ధి పనులు: మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌
రామప్ప ఆలయంతోపాటు పరిసర ప్రాంతాల్లో పర్యాటకుల కోసం పలు అభివృద్ధి కార్యక్రమాలు వేగంగా జరుగుతున్నాయని రాష్ట్ర టూరిజం శాఖ మంత్రి వి.శ్రీనివాస్‌గౌడ్‌ తెలిపారు. శాసనసభ ప్రశ్నోత్తరాల సమయంలో సభ్యులు వెంకట్రమణారెడ్డి, సీతక్క, గొంగిడి సునీత తదితరులు అడిగిన ప్రశ్నలకు మంత్రి బదులిచ్చారు. రామప్ప దేవాలయానికి యునెస్కో గుర్తింపు నేపథ్యంలో పర్యాటకులు మరింత పెరుగుతారన్న ఉద్దేశంతో అభివృద్ధి పనులు చేపట్టినట్లు వివరించారు. అదనపు వసతి, వాటర్‌ స్పోర్ట్స్, అడ్వెంచర్‌ యాక్టివిటీస్, కన్వెన్షన్‌ సెంటర్, థీమ్‌ పార్క్‌ వంటి మరిన్ని టూరిజం సౌకర్యాలను సృష్టించాలని భావిస్తున్నట్లు తెలిపారు. ఇందుకు ప్రత్యేక అథారిటీని ఏర్పాటు చేసి కార్యాచరణ రూపొందిస్తున్నట్లు తెలిపారు. ములుగు, లక్నవరం, తాడ్వాయి, మేడారం, మల్లూరు, బొగత జలపాతం వంటి పర్యాటక ప్రదేశాల్లో సౌకర్యాలను అభివృద్ధి చేస్తున్నట్లు చెప్పారు.

ఇక పర్యాటకానికి పెద్దపీట..
రాష్ట్ర ఏర్పాటు తర్వాత విద్యుత్, నీళ్లు, వ్యవసా యానికి సంబంధించిన చాలా అంశాల్లో సమ స్యలు అధిగమించే క్రమంలో పర్యాటక రంగా నికి ప్రాధాన్యత ఇవ్వలేదు. ఇప్పుడు పరిస్థితి మారింది. అన్ని రంగాల్లో ముందు వరుసలోకి వచ్చేశాం. ఇప్పుడు పర్యాటకంగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుందాం. చరిత్రకారులు చాలా శాసనాలను వెలికితీస్తున్నారు. మగధ, శాత వాహనుల గొప్ప విషయాలు వెలుగు చూస్తున్నాయి’ అని సీఎం వివరించారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top