బీఆర్‌ఎస్‌ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్‌లీడర్ హరీశ్‌రావు
సాక్షి, హైదరాబాద్: ప్రపంచస్థాయి విద్యావ్యవస్థ అంటూ గొప్పలు చెప్పుకునే సీఎం రేవంత్‌రెడ్డి ప్రభుత్వం ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను నెలల తరబడి చెల్లించకపోవడం సిగ్గుచేటని బీఆర్‌ఎస్‌ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్‌లీడర్ హరీశ్‌రావు విమర్శించారు. గత రెండున్నరేళ్లుగా నిధులు సకాలంలో విడుదల కాకపోవడంతో ప్రైవేట్ డిగ్రీ, పీజీ కళాశాలలు తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయని తెలిపారు. అధ్యాపకులు, నాన్‌టీచింగ్ సిబ్బందికి నెలల తరబడి జీతాలు అందడం లేదని, అద్దెలు, విద్యుత్ బిల్లులు, యూనివర్సిటీ ఫీజులు, ఇతర నిర్వహణ ఖర్చులు చెల్లించలేక యాజమాన్యాలు ఇబ్బందులు పడుతున్నాయని పేర్కొన్నారు.
తెలంగాణ ప్రైవేట్ డిగ్రీ, పీజీ కళాశాలల మేనేజ్‌మెంట్ అసోసియేషన్ ప్రతినిధులు మంగళవారం హరీశ్‌రావును ఆయన నివాసంలో కలిసి తమ సమస్యలను వివరించి వినతిపత్రం అందజేశారు. కొన్ని కళాశాలల్లో 5 నుంచి 10 నెలల వరకు జీతాలు పెండింగ్‌లో ఉన్నాయని తెలిపారు. ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా గతంలో సుమారు 960గా ఉన్న ప్రైవేట్ డిగ్రీ కళాశాలల సంఖ్య ఇప్పుడు దాదాపు 650కు తగ్గిందని, ఇప్పటికే 310 కళాశాలలు తగ్గిపోయాయని హరీశ్ అన్నారు.
ప్రస్తుతం మూడు బడ్జెట్లు పూర్తయినా దాదాపు రూ.10 వేల కోట్ల బకాయిలు పెండింగ్‌లో ఉన్నాయని చెప్పారు. పెండింగ్ బకాయిలను తక్షణమే పూర్తిగా విడుదల చేయడంతోపాటు, ప్రతి విద్యా సంవత్సరానికి నిర్ణీత గడువులో ఫీజు రీయింబర్స్‌మెంట్ చెల్లించే శాశ్వత విధానం అమలు చేయాలని డిమాండ్ చేశారు. బకాయిలు విడుదల చేయకపోతే ఈ అంశంపై అసెంబ్లీని స్తంభింపజేస్తామని హరీశ్‌రావు హెచ్చరించారు.


