వరంగల్‌ జిల్లాలో ప్రేమోన్మాది ఘాతుకం | Boyfriend Attacks Girlfriend Parents In Warangal District | Sakshi
Sakshi News home page

వరంగల్‌ జిల్లాలో ప్రేమోన్మాది ఘాతుకం

Jul 11 2024 9:42 AM | Updated on Jul 11 2024 3:49 PM

Boyfriend Attacks Girlfriend Parents In Warangal District

వరంగల్ జిల్లాలో ఓ ప్రేమోన్మాది ఘాతుకానికి పాల్పడ్డాడు. ప్రేమించిన అమ్మాయి కుటుంబంపై విచక్షణా రహితంగా తల్వార్‌తో దాడి చేసిన ఘటన వరంగల్ జిల్లా చంద్రరావు పేట మండలం 16 చింతల తండా జరిగింది. ఈ దాడిలో యువతి తల్లి, తండ్రులు మృతి చెందారు. యువతి, ఆమె తమ్ముడు తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

పోలీసుల కథనం ప్రకారం.. గూడూరు మండలం గుండెంగకి చెందిన మేకల నాగరాజు అలియాస్ బన్నీ 16 చింతల తండా దీపిక ప్రేమించుకున్నారు. అమ్మాయి కుటుంబ సభ్యులకు చెప్పా పెట్టకుండా ఇంట్లోనుంచి పారిపోయి పెళ్లి చేసుకున్నారు.  పెళ్లైన రెండు నెలలకే దీపిక, నాగరాజుల మధ్య మనస్పర్దలు తలెత్తడంతో పోలీసులు, పెద్దల సమక్షంలో విడిపోయారు.  

ఈ క్రమంలో నిందితుడు ముందస్తు కుట్రలో భాగంగా బుధవారం అర్ధరాత్రి 1:35 నిమిషాల సమయంలో తల్వార్‌తో దీపిక ఇంటికి వచ్చాడు. ఇంటి బయట గాడ నిద్రలో ఉన్న ఆమె కుటుంబ సభ్యులపై దాడికి తెగబడ్డాడు. ఈ దాడిలో అమ్మాయి తల్లి బానోతు సుగుణ అక్కడికక్కడే మృతి చెందారు. తండ్రి బానోతు శ్రీనివాస్ వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు.

నిందితుడు దాడితో తీవ్రగాయాల పాలైన దీపిక, ఆమె తమ్ముడు మదన్‌లు  నర్సంపేట ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.  దాడి అనంతరం నిందితుడు పరారాయ్యాడు.

నిందితుడి దాడితో స్థానికుల సమాచారంతో ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. నిందితుడు నాగరాజు కోసం బృందాలుగా విడిపోయి పోలీసులు గాలింపు చర్యల్ని ముమ్మరం చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement