కండక్టర్లు మర్యాదగా మెలగాలి: సజ్జనార్‌ ఆదేశం

Be Polite To Passengers: TSRTC MD Sajjanar To Conductors Drivers  - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ప్రయా­ణికులతో బస్సు కండక్టర్లు మర్యాదగా మెలగాలని ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌ ఆదేశించారు. సంస్థకు డ్రైవర్లు, కండక్టర్లే బ్రాండ్‌ అంబాసిడర్లన్న విషయాన్ని గుర్తించాలని ఆయన సూచించారు. బస్‌భవన్‌ నుంచి వర్చువల్‌ పద్ధతిలో ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని డిపోల్లో టీఎస్‌ఆర్టీసీ ఏప్రిల్‌ చాలెంజ్‌ ఫర్‌ట్రైనింగ్‌ పేరుతో కండక్టర్లకు శిక్షణ కార్యక్రమాన్ని శుక్రవారం ప్రారంభించారు.

ఈ సందర్భంగా పలువురు కండక్టర్లతో ఆయన మాట్లాడారు. ప్రయాణికులను బస్సుల్లోకి సాద­రంగా ఆహ్వానించాలని, గౌర­వంగా సంబోధించాలని సూచించారు. ఆక్యు­పెన్సీ రేషియోను 75 శాతానికి చేర్చాలనే సంస్థ లక్ష్యానికి కండక్టర్లు సహకారం అందించాలన్నారు.   

హైకోర్టుకు కొత్తగా ఆరుగురు జీపీలు 
సాక్షి, హైదరాబాద్‌: హైకోర్టుకు కొత్తగా జీపీ లు, ఏజీపీల నియామకం చేపడుతూ అడ్వొకేట్‌ జనరల్‌(ఏజీ) బీఎస్‌ ప్రసాద్‌ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. సల్వాజి రాజశేఖర్‌రావు, కె.సుధాకర్‌రెడ్డి, ఆర్‌.మన్మద్‌రెడ్డి, కొండపర్తి శ్రీనివాస్, ఎల్‌.సు«దీర్, కె.ప్రవీణ్‌కుమార్‌ను ప్రభుత్వ న్యాయవాదులుగా నియమించారు. మరో 31 మందిని అసిస్టెంట్‌ జీపీలుగా నియమిస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top