కాళేశ్వరంతో ఎంత ఆదాయం వచ్చింది? 

Banks Asked State Govt Over Income Of Kaleshwaram Project - Sakshi

వివరాలివ్వాలని ప్రభుత్వాన్ని కోరిన బ్యాంకులు  

తాగునీటి సరఫరాతో వచ్చే ఆదాయాన్ని కాళేశ్వరం కార్పొరేషన్‌కు బదిలీ చేయాలి 

రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసిన నీటి పారుదల శాఖ ఈఎన్‌సీ  

సాక్షి, హైదరాబాద్‌: కాళేశ్వరం ఎత్తిపోతల పథకం ద్వారా ఆదాయం వస్తుందా? ఇప్పటి వరకు వచ్చిందెంత?.. అని ప్రాజెక్టు నిర్మాణానికి రుణాలిచ్చిన బ్యాంకులు, ఆర్థిక సంస్థలు రాష్ట్ర ప్రభుత్వాన్ని అడిగాయి. ఈ వివరాలి వ్వాలని రాష్ట్ర నీటిపారుదల శాఖను కోరా యి. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా రూ.65,454 కోట్ల ప్రత్యక్ష ఆదాయం రానుందని బ్యాంకులకు సమర్పించిన టెక్నో–ఎకనామిక్‌ వయబిలిటీలో రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది. నీటి తీరు వా పన్నులు, పరిశ్రమలకు ముడి నీటి సరఫ రా, జంట నగరాలు, గ్రామాలకు తాగునీరు సరఫరాకు వసూలు చేయనున్న చార్జీలు, తదితర మార్గాల్లో ఈ మేరకు ఆదాయం రానుందని ప్రభుత్వం తెలిపింది.

దీని ఆధారంగా బ్యాంకులు, ఆర్థిక సంస్థలు కాళేశ్వరం ప్రాజె క్టు నిర్మాణానికి రుణాలిచ్చాయి. బ్యాంకులు, రుణసంస్థలతో జరిగిన ఒప్పందం ప్రకారం ప్రాజెక్టు ద్వారా వచ్చే ఆదాయంతోనే ప్రభు త్వం రుణాలను తిరిగి చెల్లించాలి. గత మా ర్చి 31 నాటికి కాళేశ్వరం పూర్తై వాణిజ్యపర కార్యకలాపాలను ప్రారంభించిందని కాళేశ్వ రం ఇరిగేషన్‌ కార్పొరేషన్‌ ప్రాజెక్టు లిమిటెడ్‌ (కేఐపీసీఎల్‌).. బ్యాంకుల కన్సార్టియంకు నివేదించింది.

ఇప్పటి వరకు ప్రభుత్వమే తన బడ్జెట్‌ నుంచి ప్రాజెక్టు కోసం తీసుకున్న రు ణాలకు వడ్డీలు చెల్లిస్తోంది. కాళేశ్వరం వాణిజ్య కార్యకలాపాలను ప్రారంభించిందని ప్రక టించిన నేపథ్యంలో గత జూన్‌ నుంచి అసలు రుణాల వాయిదాలతో పాటు వడ్డీ చెల్లింపు ను ప్రాజెక్టు ద్వారా వస్తున్న ఆదాయంతో కట్టాలి. ఈ నేపథ్యంలో ప్రాజెక్టు ద్వారా ఇప్పటివరకు ఎంత ఆదాయం వచ్చిందో సమాచారమివ్వాలని బ్యాంకులు తాజాగా కేఐపీసీఎల్‌ను కోరాయి.

నీటిపారుదల శాఖ ఈఎన్‌సీ(జనరల్‌) సి.మురళీధర్‌ తాజాగా రాష్ట్ర ప్ర భుత్వానికి రాసిన లేఖలో ఈ విషయాలను పొందుపరిచారు. ఈ క్రమంలో వివిధ రూపా ల్లో వస్తున్న ఆదాయాన్ని కాళేశ్వరం కార్పొరేషన్‌కు సాధ్యమైనంత త్వరగా బదిలీ చేయాలని ఆయన ఈ లేఖలో విజ్ఞప్తి చేశారు.  

భారం రాష్ట్ర ప్రభుత్వంపైనే..
కాళేశ్వరం ఇరిగేషన్‌ కార్పొరేషన్‌ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం రూ.86,064 కోట్ల రుణాలను వివి ధ బ్యాంకులు, సంస్థల నుంచి తీసుకుంది. మొత్తం రూ.97,445 కోట్ల రుణాలు రావాల్సి ఉండగా, మిగిలిన రుణాలు కేంద్ర ప్రభుత్వ ఆంక్షలతో నిలిచిపోయాయి. జంట నగరాల్లో నెలకు 20వేల లీటర్ల ఉచిత తాగునీటిని సరఫరా చేస్తుండటంతో జలమండలికి వచ్చే ఆదాయం పడిపోయింది.

మిషన్‌ భగీరథ ద్వారా గ్రామాలకు సరఫరా చేసే నీళ్లకు సైతం నీటి కుళాయి చార్జీలు వసూలు చేయట్లేదు. రాష్ట్రంలో నీటి తీరువా పన్నుల వసూళ్లను ఎప్పుడో ప్రభుత్వం రద్దు చేసింది. ఈ నేపథ్యంలో కాళేశ్వరం ద్వారా ఆదాయ మార్గాలన్నీ మూసుకుపోయాయి. నీటి తీరు వా పన్నులు, కుళాయి చార్జీలను రాష్ట్ర ప్రభు త్వం సబ్సిడీల రూపంలో కాళేశ్వరం కార్పొరే షన్‌ ఖాతాలోకి జమ చేయక తప్పని పరిస్థితి.. దీనికి బ్యాంకులు, రుణ సంస్థలు అంగీకరిస్తాయా.. అన్నది ప్రశ్నార్థకంగా మారింది.   

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top