
బ్యాలెట్ పేపర్లతోనే ఎన్నికలు.. రాష్ట్ర ఎన్నికల సంఘం వెల్లడి
సాక్షి, హైదరాబాద్: స్థానిక ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో.. ఈ ఎన్నికల నిర్వహణలో ప్రత్యక్షంగా, పరోక్షంగా ముడిపడి ఉన్న అధికారులందరి బదిలీలు, పోస్టింగ్‌లపై పూర్తి నిషేధం విధించినట్టు రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్‌ఈసీ) తెలిపింది. ఈ ఎన్నికలను బ్యాలెట్ బాక్స్‌లు, బ్యాలెట్ పేపర్లతోనే నిర్వ హిస్తు న్నట్టు ఎస్‌ఈసీ తెలిపింది. గుజరాత్, కర్ణాటక, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్‌ల నుంచి బ్యాలెట్ బాక్స్‌లను రప్పించినట్లు వెల్లడించింది.
ఎన్నికల సమయంలో లౌడ్‌స్పీకర్ల వినియోగం, ఊరేగింపులు, బహిరంగ సభల నిర్వహణ, ఓటర్లను ప్రలోభపరిచే అవి నీతి చర్యలు, తదితరాలపై పోలీస్‌శాఖ కచ్చితమైన చర్యలు తీసు కోవాలని సూచించింది. సోమవారం ఉదయం 10.30 గంటలకు స్థానిక ఎన్నికల షెడ్యూల్‌ను విడుదల చేసినందున, అప్పటి నుంచే ఎన్నికల ప్రవర్తనా నియమావళి (ఎంసీసీ)అమల్లోకి వచ్చిందని జిల్లా కలెక్టర్లకు ఎస్‌ఈసీ కార్యదర్శి మంద మకరంద్ తెలియ జేశారు. రాష్ట్రవ్యాప్తంగా గ్రామీణ స్థానిక సంస్థల పరిధిలోని సంబంధిత ప్రాంతాల్లో కోడ్ అమల్లోకి వచ్చిందన్నారు.
రాష్ట్ర ప్రభుత్వ ఆమోదంతోనే..
ఎన్నికల నిర్వహణకు సంబంధించిన అన్ని ముందస్తు కార్యకలా పాలను ముగించి, ముసాయిదా షెడ్యూల్‌ను పంపించిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వ ఆమోదం (కాంకరెన్స్)తో ఎన్నికల తేదీలను ఖరా రు చేసినట్టు పేర్కొంది. రాష్ట్ర ప్రభుత్వం స్థానిక సంస్థల స్థానా లకు సంబంధించి మండల, జిల్లా పరిషత్, గ్రామ పంచాయతీ లకు రిజర్వేషన్లు తెలియజేసిందని తెలిపింది. ఆ తర్వాత సీఎస్, డీజీపీ, పీఆర్‌ఆర్‌డీ, ఆర్థిక, ఎక్సైజ్ శాఖల ముఖ్య కార్యదర్శులు, పీఆర్‌ఆర్‌డీ డైరెక్టర్, ఎస్‌ఈసీ కార్యదర్శిలతో రాష్ట్ర ఎన్నికల కమి షనర్ రాష్ట్రస్థాయి సమావేశాన్ని నిర్వహించినట్లు వెల్లడించింది.
ఈ శాఖలకు చెందిన అధికారులంతా సూచించిన షెడ్యూల్ తేదీ లకు అనుగుణంగా ఎన్నికల నిర్వహణకు సంసిద్ధతను వ్యక్తం చేసి నట్టు వివరించింది. స్థానిక ఎన్నికల నిర్వహణ గడువును సెప్టెంబర్ 30 నుంచి మరో 45 రోజుల పాటు పొడిగింపు కోరుతూ న్యాయస్థానంలో పిటిషన్‌ను దాఖలు చేసినట్టు వెల్లడించింది.
జిల్లాల్లో ఏర్పాట్లపై ఎస్‌ఈసీ సమీక్ష
స్థానిక ఎన్నికలు జరగనున్న 31 గ్రామీణ జిల్లాల్లో ఎన్నికల ప్రవర్తనా నియమావళి (ఎంసీసీ) అమలు, శాంతి భద్రతల పరిస్థితి, ఎన్నికలకు సంబంధించిన సన్నాహాలను రాష్ట్ర ఎన్నికల సంఘం సమీక్షించింది. సోమవారం జిల్లా కలెక్టర్లు ( జిల్లా ఎన్నికల అధికారులు), కమిషనర్లు/ ఎస్పీలు, ఇతర జిల్లాస్థాయి ఎన్నికల అధికారులతో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. డీజీపీ, పీఆర్‌శాఖ ముఖ్య కార్యదర్శి, ఇతర అధికారులు పాల్గొన్నారు. పోలింగ్ శాంతియుత వాతా వరణంలో జరిగేలా చర్యలు తీసుకోవాలని కోరారు.
ఇద్దరు పిల్లలకు మించొద్దు
మండల, జిల్లా పరిషత్, గ్రామపంచాయతీ ఎన్నికల్లో.. ఇద్దరికి మించి పిల్లలు ఉన్నట్టయితే పోటీ చేయడానికి అనర్హులు. గతంలో ఉమ్మడి ఏపీలో చంద్రబాబు సర్కార్ ఈ నిబంధన తీసుకువచ్చింది. రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్‌లో ఈ నిబంధన ఎత్తి వేశారు. తెలంగాణ గ్రామీణ స్థానిక సంస్థల ఎన్నికల్లో మాత్రం కొనసాగుతోంది. రాష్ట్ర కేబినెట్‌లో ఈ అంశం చర్చకు రాగా, ఈ నిబంధనను కొనసాగించాలని నిర్ణయించినట్టు సమాచారం. అయితే పట్టణ స్థానిక సంస్థల్లో బీఆర్‌ఎస్ హయాంలో ఈ నిబంధనను తొలగించారు.