
సాక్షి, హైదరాబాద్: నిజాం 9వ వారసుడి పట్టాభిషేకం శుక్రవారం రాత్రి చౌమహల్లా ప్యాలెస్‌లో సాదాసీదాగా జరిగింది. ఇటీవల 8వ నిజాం ముకరంజా బహదూర్ కన్నుమూయడంతో ఆయన పెద్ద కుమారుడు మహ్మద్ అజ్మత్ అలీఖాన్ అజ్మత్ జాను 9వ నిజాంగా ప్రకటించారు.
నిజాం సంస్థానానికి సంబంధించిన వ్యవహారాలను కట్టబెడుతూ నిజాం కుటుంబ సభ్యులు, ట్రస్టీ సభ్యులు నిర్ణయం తీసుకున్నారు. దీనికి అనుగుణంగా చౌమహల్లా ప్యాలెస్‌లో ఈ బాధ్యతల స్వీకరణ కార్యక్రమం జరిగింది. ఇక నుంచి అజ్మత్ అలీఖాన్ నిజాం ఆస్తులు, ఇతరత్రా వ్యవహారాలు పర్యవేక్షించనున్నారు.