ఆరు.. వణికారు! | Asifabad District Recorded Minimum Temperature Of 6 Degrees Celsius | Sakshi
Sakshi News home page

ఆరు.. వణికారు!

Dec 21 2021 4:48 AM | Updated on Dec 21 2021 5:58 PM

Asifabad District Recorded Minimum Temperature Of 6 Degrees Celsius - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో కనిష్ట ఉష్ణోగ్రతలు మరింత పడిపోయాయి. కుమ్రుంభీం ఆసిఫాబాద్‌ జిల్లా సిర్పూర్‌లో కనిష్ట ఉష్ణోగ్రత 6 డిగ్రీల సెల్సియస్‌ నమోదైంది. ఇప్పటివరకు సీజన్‌లో నమోదైన అత్యల్ప కనిష్ట ఉష్ణోగ్రత ఇదే. ఆదిలాబాద్‌ జిల్లా అర్లిలో 6.2 డిగ్రీల సెల్సియస్, ఆసిఫాబాద్‌ జిల్లా గిన్నెదారిలో 6.4 డిగ్రీల సెల్సియస్‌ చొప్పున కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

ప్రధాన నగరాల వారీగా పరిశీలిస్తే.. మెదక్‌లో గరిష్ట ఉష్ణోగ్రత 30.8 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 7.8 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైంది. సోమవారం రాష్ట్రంలో సాధారణ ఉష్ణోగ్రతల కంటే 2 నుంచి 5 డిగ్రీల సెల్సియస్‌ మేర తక్కువగా నమోదయ్యాయని, రానున్న రెండ్రోజులూ ఇదే తరహాలో తక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ సూచించింది. రాష్ట్రానికి ఈశాన్య దిశ నుంచి తక్కువ ఎత్తులో గాలులు వీస్తున్నాయని, కనిష్ట ఉష్ణోగ్రతలు తగ్గడంతో చలి పెరుగుతుందని వాతావరణ శాఖ తెలిపింది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement