యాంటీబాడీలతో కరోనాకు చికిత్స

Antibodies Will Help For Treating Coronavirus - Sakshi

కోవిడ్‌ కట్టడికి ప్రపంచమంతా వ్యాక్సినేషన్‌ ప్రక్రియ ముమ్మరంగా సాగుతుంటే.. అమెరికాకు చెందిన ఎలి లిలీ అనే ఫార్మా కంపెనీ మరో శుభవార్త తెచ్చింది. యాంటీబాడీలతో కోవిడ్‌ చికిత్స చేసేందుకు తాము జరిపిన ప్రయోగాలు సత్ఫలితాలిచ్చాయని ప్రకటించింది. బామ్లానివిమాబ్‌ పేరుతో తాము సిద్ధం చేసిన యాంటీబాడీలు 80 శాతం సామర్థ్యాన్ని కనబరిచినట్లు తెలిపింది. మూడోదశ ప్రయోగాలకు సంబంధించిన ప్రాథమిక ఫలితాలు ఆశాజనకంగా ఉన్నాయని పేర్కొంది. వ్యాక్సిన్‌ వేయించుకోలేని వారికి కరోనా నుంచి రక్షణ పొందే వీలు కలుగుతుందని కంపెనీ ప్రకటించింది. వైరస్‌లను ఎదుర్కొనే యాంటీబాడీల తయారీకి టీకాలు ఉపయోగపడతాయన్నది మనకు తెలిసిన విషయమే.

కరోనా వచ్చి కోలుకున్న వ్యక్తి రక్తం నుంచి సేకరించిన యాంటీబాడీలతో చికిత్స చేస్తే అది ప్లాస్మా థెరపీ అంటారు. ఎలి లిలీ అభివృద్ధి చేసిన కొత్త చికిత్స పద్ధతిలో పరిశోధనశాలలో అభివృద్ధి చేసిన యాంటీబాడీలను శరీరంలోకి ఎక్కిస్తారు. గతేడాది అక్టోబర్‌లో అప్పటి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ కూడా రిజెనెరాన్‌ అనే కంపెనీ తయారు చేసిన యాంటీబాడీలను తీసుకుని, బాగా పనిచేస్తుందని కితాబిచ్చారు కూడా. గతేడాది నవంబర్‌లోనే ఎలి లిలీ ‘బామ్లానివిమాబ్‌’కు అమెరికా ఫుడ్‌ అండ్‌ డ్రగ్‌ అడ్మినిస్టేషన్‌ (ఎఫ్‌డీఐ) అత్యవసర అనుమతులు ఇచ్చింది. అయితే వ్యాధి బాగా ముదిరాక యాంటీబాడీలు ఇవ్వడం వల్ల పరిస్థితి మరింత క్షీణించే అవకాశముందని కొన్ని హెచ్చరికలు వినిపించాయి.

కొత్త వారికి మాత్రం మేలు..
కొత్తగా వ్యాధి బారిన పడిన వారిపై మోనోక్లోనల్‌ యాంటీ బాడీ చికిత్స సత్ఫలితాలు ఇస్తుందని ఇప్పటివరకు జరిగిన పరిశోధనలు నిరూపించాయి. ఇప్పుడు ఎలి లిలీ బామ్లాని విమాబ్‌ మూడో దశ మానవ ప్రయోగాలు కూడా దాన్ని రూఢీ చేశాయి. వ్యాధి సోకక ముందు కూడా ముందు జాగ్రత్త చర్యగా దీన్ని వాడొచ్చని కంపెనీ చెబుతోంది. గతేడాది ఆగస్టులో కరోనా కేసులు ఎక్కువగా నమోదైన ప్రాంతాల్లో ఆస్పత్రుల్లో మూడో దశ మానవ ప్రయోగాలు చేశామని, సిబ్బందితో పాటు రోగులకు కూడా బామ్లానివిమాబ్, ఉత్తుత్తి మందులను అందించామని కంపెనీ తెలిపింది. ఫలితాలను పరిశీలిస్తే బామ్లానివిమాబ్‌ తీసుకున్న వారిలో 80 శాతం మందికి వ్యాధి సోకలేదని పరిశోధనలు నిర్వహించిన శాస్త్రవేత్త మైరాన్‌ కోహెన్‌ తెలిపారు. మూడో దశ మానవ ప్రయోగాలు కొనసాగు తున్నాయని పేర్కొంది.        – సాక్షి, హైదరాబాద్‌  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వార్తలు

02-03-2021
Mar 02, 2021, 13:12 IST
 దేశంలో గత 24 గంటల్లో 12,286  కొత్త కరోనా కేసులు బయటపడ్డాయి.
02-03-2021
Mar 02, 2021, 12:40 IST
సరిగ్గా ఏడాది క్రితం దేశరాజధాని ఢిల్లీలో ప్రముఖ ఎల్‌ఎన్‌జేపీ ఆసుపత్రిలో వైద్యసిబ్బంది కోవిడ్‌ మహమ్మారిపై అవిశ్రాంత పోరాటాన్ని ప్రకటించారు.
02-03-2021
Mar 02, 2021, 05:07 IST
న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ(70) ఢిల్లీలోని అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ(ఎయిమ్స్‌)లో సోమవారం ఉదయం 6.30 గంటలకు కరోనా...
01-03-2021
Mar 01, 2021, 20:16 IST
భారత్‌ అభివృద్ధి చేస్తోన్న కరోనా వ్యాక్సిన్‌ డాటాని హ్యాక్‌ చేసేందుకు యత్నం
01-03-2021
Mar 01, 2021, 16:52 IST
తాజా కేసులతో మొత్తం కేసుల సంఖ్య 1,10,96,731కు చేరుకుందని ఆరోగ్య శాఖ తెలిపింది. కేవలం ఆరు రాష్ట్రాల్లోనే అధిక శాతం...
01-03-2021
Mar 01, 2021, 14:32 IST
ఎస్‌ఎస్‌ తాడ్వాయి: ములుగు జిల్లా ఎస్‌ఎస్‌ తాడ్వాయి మండలంలోని మేడారం సమ్మక్క– సారలమ్మ ఆలయాన్ని సోమవారం నుంచి 21 రోజుల...
01-03-2021
Mar 01, 2021, 13:52 IST
సాక్షి, న్యూఢిల్లీ: దేశ వ్యాప్తంగా రెండవ దశ  వ్యాక్సినేషన్‌ ప్రక్రియ సోమవారం షురూ  అయింది. 60 ఏళ్లు పైబడిన, 45...
01-03-2021
Mar 01, 2021, 04:03 IST
సాక్షి, హైదరాబాద్‌: దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న 45–59 ఏళ్ల వయసు వారికి కరోనా టీకా ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది....
01-03-2021
Mar 01, 2021, 02:50 IST
న్యాయస్థానంలో ఒక కేసు విచారణ సందర్భంగా న్యాయవాది తన వాదనలు వినిపించేందుకు మాస్క్‌ను తొలిగించి వాదనలకు ఉపక్రమించాడు. అది గమనించిన...
01-03-2021
Mar 01, 2021, 01:52 IST
వాషింగ్టన్‌: కరోనాతో అతలాకుతలమవుతున్న అగ్రరాజ్యం అమెరికా మూడో వ్యాక్సిన్‌కి అనుమతులు మంజూరు చేసింది. జాన్సన్‌ అండ్‌ జాన్సన్‌ సంస్థ తయారు...
01-03-2021
Mar 01, 2021, 00:34 IST
రియో డీ జెనీరో: బ్రెజిల్‌లోని రియో డీ జెనీరోలో కరోనా మళ్లీ పడగ విప్పుతోంది. ఆసుపత్రులు కరోనా బాధితులతో నిండిపోతున్నాయి....
28-02-2021
Feb 28, 2021, 06:05 IST
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో కరోనా పాజిటివ్‌ కేసులు మళ్లీ పెరుగుతుండడం కలవరం కలిగిస్తోంది. కొన్ని రాష్ట్రాల్లో కరోనా వైరస్‌ వ్యాప్తి...
28-02-2021
Feb 28, 2021, 03:38 IST
ప్రైవేట్‌ హాస్పిటళ్లలో కరోనా టీకా ధరను కేంద్ర ప్రభుత్వం ఖరారు చేసింది. ఒక్కో డోసుకు రూ.250 వరకు వసూలు చేయొచ్చని...
27-02-2021
Feb 27, 2021, 14:54 IST
.అన్ని ప్రభుత్వ వ్యాక్సినేషన్‌ సెంటర్ల వద్ద ఉచితంగానే టీకా ఇస్తారని, కానీ ప్రైవేటు ఆస్పత్రులకు వెళ్లాలని భావిస్తే ముందుగా నిర్ణయించిన...
27-02-2021
Feb 27, 2021, 13:29 IST
దౌత్యవేత్తలు దాదాపు 32 గంటల పాటు ట్రాలీని రైలు పట్టాలపై తోసుకుంటూ
25-02-2021
Feb 25, 2021, 10:24 IST
సాక్షి, ముంబై : పుణేకు చెందిన అజయ్‌ మునోత్‌ (50) అనే వ్యక్తి ప్లాస్మా దానం చేసి ఏకంగా తొమ్మిది...
25-02-2021
Feb 25, 2021, 09:52 IST
జంక్‌ఫుడ్‌ జోలికీ వెళ్లకుండా పసుపురంగులోని కిస్‌మిస్‌లను రోజూ తినడం వల్ల ఆరోగ్యంగా ఉన్నారు
25-02-2021
Feb 25, 2021, 09:15 IST
అక్రా: భారత్‌లోని పుణెలో సీరమ్‌ ఇనిస్టిట్యూట్‌ తయారు చేస్తున్న కోవిషీల్డ్‌ కోవిడ్‌ వ్యాక్సిన్‌ 6 లక్షల డోసులు ఘనా దేశానికి చేరుకున్నాయి....
25-02-2021
Feb 25, 2021, 03:43 IST
సాక్షి, అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా పోలీస్‌ సిబ్బందికి కోవిడ్‌ వ్యాక్సిన్‌ అందించే కార్యక్రమం మొదలైంది. మంగళగిరిలోని పోలీస్‌ ప్రధాన కార్యాలయంలో బుధవారం...
25-02-2021
Feb 25, 2021, 01:15 IST
సాక్షి ముంబై: మహారాష్ట్రలో కరోనా మహమ్మారి మళ్లీ ఉధృతరూపం దాల్చుతోంది. వాషీం జిల్లా రిసోడ్‌ తాలూకా దేగావ్‌లోని ఓ రెసిడెన్షియల్‌...
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top