
యూరో-నెఫ్రో చికిత్సలపై దృష్టిపెట్టిన భారతదేశంలోనే అతిపెద్ద సింగిల్ స్పెషాలిటీ ఆస్పత్రి చైన్ అయిన ఏషియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ నెఫ్రాలజీ అండ్ యూరాలజీ (ఏఐఎన్‌యూ) హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌లో తన ప్రధాన ఆస్పత్రిని ప్రారంభించింది.
ప్రముఖ వైద్యులు డాక్టర్ నాగేశ్వర్‌రెడ్డి, సిటీ పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్, బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపీచంద్ ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. ఈ కొత్త ఆస్పత్రిలో 150 పడకలు, 4 ఆపరేషన్ థియేటర్లు, 34 డయాలసిస్ బెడ్లు, సంక్లిష్టమైన యూరాలజీ, నెఫ్రాలజీ శస్త్రచికిత్సల కోసం అత్యాధునిక రోబోటిక్ టెక్నాలజీ ఉన్నాయి. దీంతో దేశంలోనే సింగిల్ స్పెషాలిటీ ఆస్పత్రులలో ఇది అతిపెద్ద కార్పొరేట్ ఆస్పత్రిగా నిలిచింది.
ఈ సందర్భంగా ఏఐఎన్‌యూ ఛైర్మన్, చీఫ్ కన్సల్టెంట్ యూరాలజిస్ట్ డాక్టర్ సి. మల్లికార్జున మాట్లాడుతూ, “యూరలాజికల్ సమస్యలు ఉన్న రోగుల చికిత్సను సమూలంగా మార్చడంలో సాంకేతిక ఆవిష్కరణలు కీలకపాత్ర పోషిస్తున్నాయి. రోబోటిక్ సర్జరీ, ఎండోస్కొపిక్, లాప్రోస్కొపిక్ సర్జరీలు, 3డి ఇమేజింగ్, ఏఐ వాడకం లాంటివి యూరాలజీ రంగం రూపురేఖలు మారుస్తున్నాయి. శస్త్రచికిత్సల కచ్చితత్వం, సమర్థత వీటివల్ల మరింత పెరిగింది. యూరో-నెఫ్రో చికిత్సలలో అత్యంత కచ్చితత్వం, అత్యాధునిక టెక్నాలజీలతో రోగులు వేగంగా, సురక్షితంగా, మరింత సమర్థంగా కోలుకునేలా చేయడంలో మా 12 ఏళ్ల వారసత్వాన్ని ఏఐఎన్‌యూ బంజారాహిల్స్ ఆస్పత్రి మరింత ముందుకు తీసుకెళ్తుంది. మేం సేవ చేసే వర్గాల ప్రయోజనం కోసం వైద్య విజ్ఞానాన్ని, పరిశోధనను, ఆవిష్కరణలను మరింత ముందుకు తీసుకెళ్తూ, వైద్యపరమైన విజయాలు సాధించే సంస్కృతిని నెలకొల్పుతున్నాం” అని తెలిపారు.
ఏఐఎన్‌యూ ఆస్పత్రి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డాక్టర్ పీసీ రెడ్డి మాట్లాడుతూ, “ఏఐఎన్‌యూ బంజారాహిల్స్ ఆస్పత్రి విస్తరణతో మేం యూరాలజీ, నెఫ్రాలజీలలో ఇంకా లోతుకు వెళ్లి.. యూరో-ఆంకాలజీ, ఆండ్రాలజీ, పీడియాట్రిక్ యూరాలజీ, ఫిమేల్ యూరాలజీ లాంటి సబ్ స్పెషాలిటీలపై దృష్టిపెడుతున్నాం. సగటున పదేళ్లకు పైగా అనుభవం ఉన్న ఇక్కడి వైద్యులంతా అత్యున్నత శిక్షణ పొంది, మంచి నైపుణ్యాలు కలిగి ఉన్నారు. వీరంతా కలిసి ప్రతి రోగికీ అత్యుత్తమ ఫలితాలు వచ్చేలా నిర్ధారిస్తారు. వ్యాధి వచ్చాక చికిత్సల కంటే నిరోధించడంపైనా చాలా దృష్టిపెట్టాం. కొన్ని వ్యాధులను త్వరగా గుర్తిస్తే ఇతర వ్యాధులు కూడా రాకుండా ఆపగలం. ఈ విషయాలను దృష్టిలో పెట్టుకుని ఏఐఎన్‌యూ ఆధ్వర్యంలో తెలంగాణలని గ్రామాల్లో ఉచిత స్క్రీనింగ్ శిబిరాలు నిర్వహిస్తున్నాం. వాటిద్వారా మూత్రంలో ప్రోటీన్ పోవడం, అధిక రక్తపోటు లాంటి ముందస్తు లక్షణాలను గుర్తిస్తున్నాం” అని చెప్పారు.
ఏషియా హెల్త్‌కేర్ హోల్డింగ్స్ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ విశాల్ బాలి మాట్లాడుతూ, “భారత ఉపఖండంలో పెరుగుతున్న యూరాలజీ, నెఫ్రాలజీ సమస్యల కారణంగా ఈ రంగంలో ప్రత్యేకంగా చికిత్సలు చేయాల్సిన అవసరం ఉంది. ఏషియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ నెఫ్రాలజీ అండ్ యూరాలజీ ద్వారా మేం దేశంలోనే అతిపెద్ద సింగిల్ స్పెషాలిటీ నెట్‌వర్క్ ఈ విభాగంలో ఏర్పాటుచేస్తున్నాం. ఇందులో అత్యున్నత నైపుణ్యం గల వైద్యులు, అత్యాధునిక టెక్నాలజీ కలయిక ఉంటుంది. మన దేశంలో ఏడాదికి 2 కోట్లకు పైగా నెఫ్రాలజీ, యూరాలజీ ప్రొసీజర్లు జరుగుతాయి. అందువల్ల రోగుల చికిత్సలో సరికొత్త ప్రమాణాలు పాటించాలి. యూరో-నెఫ్రో రంగంలో ఏఐఎన్‌యూ కచ్చితత్వాన్ని పునర్నిర్వచిస్తోంది” అన్నారు.
ఏఐఎన్‌యూ సీఈఓ సందీప్ గూడూరు మాట్లాడుతూ, “బంజారాహిల్స్ ఆస్పత్రి దేశంలోనే మా ప్రధాన ఆస్పత్రి అవుతుంది. దేశంలో యూరాలజీ, నెఫ్రాలజీ చికిత్సలకు అత్యంత నమ్మకమైన సింగిల్ స్పెషాలిటీ ఆస్పత్రిగా దీన్ని తీర్చిదిద్దాలన్నది మా లక్ష్యం. గత ఆరేళ్లలో మేం ఒక ఆస్పత్రి నుంచి మెట్రో నగరాల్లో ఏడు, ద్వితీయశ్రేణి నగరాల్లో రెండు ఆస్పత్రులకు ఎదిగాం. ఇప్పటివరకు 1200కు పైగా రోబోటిక్ సర్జరీలు, వెయ్యికిపైగా రీకన్‌స్ట్రక్టివ్ యూరాలజీ సర్జరీలు, 300కుపైగా కిడ్నీ మార్పిడులు, 2 లక్షలకు పైగా డయాలసిస్ సెషన్లు చేసి దేశంలోని ఏడు యూనిట్లలో 5 లక్షల మంది రోగులకు సేవలందించాం. రాబోయే 18-24 నెలల్లో మరో మూడు కొత్త ఆస్పత్రులు ఏర్పాటుచేయాలని చూస్తున్నాం” అని వివరించారు