హైదరాబాద్: ప్రస్తుత డిజిటల్ యుగంలో సైబర్ మోసాలు అధికం అయిపోయాయని, ముఖ్యంగా ఏఐ, డీప్ ఫేక్ క్లోనింగ్‌లతో ఆధునిక తరహా మోసాలు జరుగుతున్నాయని, వీటి నివారణకు ‘సేఫ్ వర్డ్’తో రక్షణ పొందాలని హైదరాబాద్ నగర సీపీ సజ్జన్నార్ ఒక ప్రకటనలో పిలుపునిచ్చారు.
డీప్‌ఫేక్ మోసాలను ఎదుర్కొనేందుకు ‘సేఫ్ వర్డ్’ఉపయోగించాలని సజ్జనార్ సూచించారు. తెలంగాణలో డీప్ ఫేక్, సైబర్ మోసాల కేసులు విపరీతంగా పెరుగుతున్నందున, వీటి బారిన పడకుండా ఉండేందుకు నమ్మకమైన పరిచయస్తుల నడుమ‘సురక్షిత పదం’ (సేఫ్ వర్డ్)ను ఉపయోగించాలన్నారు. మంగళవారం తన ‘ఎక్స్’ ఖాతాలో నగర సీపీ సజ్జన్నార్..ఏఐ సాధనాలు ఇప్పుడు ఆశ్చర్యకరమైన ఖచ్చితత్వంతో ముఖాలు, గొంతులను క్లోనింగ్ చేయగలవన్నారు. దీంతో మోసగాళ్లు మన స్నేహితులు, సహోద్యోగులు లేదా అధికారుల మాదిరిగా కూడా నటించగలరని సజ్జనార్ హెచ్చరించారు. ఏఐ,డీప్‌ఫేక్‌ల యుగంలో ‘సురక్షిత పదం’ బలమైన రక్షణగా నిలుస్తుందని ఆయన పేర్కొన్నారు.
In the age of AI and deepfakes, a ‘safe word’ is your strongest protection!
AI tools can now clone your face and voice with shocking accuracy. Fraudsters misuse these deepfakes to trick people — pretending to be your friend, colleague, or even an official.
👉 Defend yourself… pic.twitter.com/HTw0o097rS— V.C. Sajjanar, IPS (@SajjanarVC) October 28, 2025
కుటుంబ సభ్యులు, నమ్మకమైన పరిచయస్తులతో ఒక ప్రత్యేకమైన భద్రతా పదాన్ని రూపొందించుకోవాలి, వ్యక్తిగత లేదా ఆర్థిక సమాచారాన్ని పంచుకునే ముందు దానిని ఉపయోగించి, ఏవైనా అనుమానాస్పద కాల్‌లు లేదా సందేశాలను ధృవీకరించాలని ఆయన సూచించారు. డీప్‌ఫేక్ అనుకరణలకు సంబంధించిన సైబర్ ఫిర్యాదులు అంతకంతకూ పెరుగుతున్నాయని సజ్జన్నార్ పేర్కొన్నారు. స్కామర్లు క్లోన్ చేసిన వాయిస్‌లు, వీడియోలను ఉపయోగించి డబ్బు లేదా సున్నితమైన డేటాను అత్యవసరంగా బదిలీ చేయాలని డిమాండ్ చేస్తారని హెచ్చరించారు. అందుకే అందరూ అప్రమత్తంగా ఉండాలని కోరారు. కాగా ఇటువంటి మోసపూరిత కార్యకలాపాలను గుర్తించేందుకు ప్రజల మధ్య డిజిటల్ అక్షరాస్యత ప్రచారాలను సైబర్ క్రైమ్ యూనిట్లు ముమ్మరం చేశాయి.
ఇది కూడా చదవండి: ఢిల్లీ విమానాశ్రయం వద్ద బస్సులో మంటలు


