న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (ఐజీఐఏ)లోని టెర్మినల్ 3 వద్ద మంగళవారం మధ్యాహ్నం ఒక బస్సులో మంటలు చెలరేగాయి. ఈ బస్సును ఏఐ శాట్స్(టాటా గ్రూప్‌లో భాగమైన ఎయిర్ ఇండియా లిమిటెడ్-శాట్స్‌లిమిటెడ్ మధ్య జాయింట్ వెంచర్) నడుపుతోంది. ఇది ఎయిర్ ఇండియాకు గ్రౌండ్-హ్యాండ్లింగ్ సేవలను అందిస్తుంది. విమానాశ్రయ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం, ఈ సంఘటన టెర్మినల్ 3 వద్ద బే 32 సమీపంలో జరిగింది. ఆసమయంలో బస్సు ఎయిర్ ఇండియా విమానానికి కొన్ని అడుగుల దూరంలో టాక్సీవే ప్రాంతంలో ఉంది. సంఘటన జరిగిన సమయంలో విమానంలో ప్రయాణికులు లేరు.
An Air India bus at Delhi Airport’s Terminal 3, not too far away from a parked aircraft, suddenly caught fire on Tuesday. Officials confirmed that no passengers were onboard at the time.
The bus was operated by AI SATS, a ground-handling service provider for Air India, near bay… pic.twitter.com/UdP6Aa1qGP— Breaking Aviation News & Videos (@aviationbrk) October 28, 2025
బస్సులో మంటలు చెలరేగినట్లు సమాచారం అందిన వెంటనే విమానాశ్రయంలో హెచ్చరికలు జారీ చేశారు. అగ్నిమాపక సిబ్బంది వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారని ఐజీఐఏ అధికారులు తెలిపారు. వారు మంటలను అదుపులోకి తెచ్చారన్నారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలో బస్సులో మంటలు భారీగా ఎగసిపడుతున్నట్లు కనిపిస్తోంది. అయతే ప్రస్తుతం పరిస్థితి అదుపులోనే ఉందని విమానాశ్రయ అధికారులు తెలిపారు. ఈ ఘటనతో విమానాశ్రయ కార్యకలాపాలపై పెద్దగా ప్రభావం చూపనప్పటికీ, విమానాశ్రయంలోని ప్రయాణికులను భయాందోళనలకు గురిచేసింది.


