సాక్షి,హైదరాబాద్: జలమండలి జీఎం అనంతకుమార్ అరెస్ట్ అయ్యారు. అనంతకుమార్ వద్ద భారీ అక్రమాస్తులు ఉన్నట్లు గుర్తించిన ఏసీబీ అధికారులు.. సుదీర్ఘ సోదాల అనంతరం అరెస్ట్ చేశారు. సుమారు 15 గంటలపాటు అనంతకుమర్ నివాసంలో తనిఖీలు నిర్వహించిన అనంతరం అదుపులోకి తీసుకున్నారుప.
ఈ తనిఖీల్లో రూ.100 కోట్లకు పైగా ఆస్తులు కూడబెట్టినట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. నిజామాబాద్, సంగారెడ్డిలో 18 ఎకరాల భూమి, 6 ఓపెన్ ప్లాట్లు, 3 ఫ్లాట్లు ఉన్నట్లు బయటపడింది. జీఎం కుమార్‌కు చెందిన బ్యాంక్ లాకర్లు కూడా తెరిచి తనిఖీ చేశారు. సోదాలు మరికొన్ని గంటలు కొనసాగే అవకాశం ఉన్నట్లు సమాచారం.
ఈ రోజు మంగళవారం ఏసీబీ అధికారులు హైదరాబాద్ జలమండలి జీఎం అనంతకుమార్ ఇంట్లో సోదాలు ప్రారంభించారు. ప్రారంభ సమయంలో తనిఖీల్లో రూ.కోటి ఐదు లక్షలు స్వాధీనం చేసుకున్నారు. కిలోకు పైగా బంగారం, నిజామాబాద్‌లో మూడు ఎకరాల భూమి, ఇతర స్థిరాస్తులు ఉన్నట్లు తేలింది. వీటన్నిటి విలువ దాదాపు రూ.100 కోట్లుగా భావిస్తున్నారు. అదే విధంగా అనంతకుమార్ బ్యాంక్ లాకర్లు కూడా తెరిచి తనిఖీ చేయాలని అధికారులు నిర్ణయించారు. జీఎంతో పాటు ఆయన బంధువుల ఇళ్లలోనూ ఏకకాలంలో తనిఖీలు జరిపారు. రెడ్ హిల్స్‌లోని జీఎం నివాసంతో పాటు మల్లాపూర్‌లోని నివాసంలో ఏసీబీ అధికారులు సోదాలు చేపట్టారు.



