ఆదాయానికి మించి ఆస్తులు.. డిప్యూటీ కలెక్టర్ ఇళ్లలో ఏసీబీ సోదాలు | ACB Raids On Deputy Collector Vamshi Mohan Houses | Sakshi
Sakshi News home page

ఆదాయానికి మించి ఆస్తులు.. డిప్యూటీ కలెక్టర్ ఇళ్లలో ఏసీబీ సోదాలు

May 22 2026 12:35 PM | Updated on May 22 2026 7:05 PM

ACB Raids On Deputy Collector Vamshi Mohan Houses

సాక్షి, రంగారెడ్డి: రంగారెడ్డి జిల్లా డిప్యూటీ కలెక్టర్ వంశీ మోహన్‌ ఇళ్లలో ఏసీబీ అధికారులు సోదాలు చేపట్టారు. ఆదాయానికి మించి ఆస్తులు సంపాదించారనే సమాచారంతో రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు శుక్రవారం ఉదయం నుంచి వంశీ మోహన్‌కు సంబంధించి 8 ఇళ్లలో తనిఖీలు చేపట్టింది.

కాగా, వంశీ మోహన్‌ శేరిలింగంపల్లితో పాటు ఇతర ప్రాంతాల్లో ఆర్డీవో పనిచేసిన సమయంలో వంశీ మోహన్ పెద్దఎత్తున ప్రభుత్వ ఆస్తులు కొట్టేసినట్లు ఆరోపణలు వచ్చాయి. ఆదాయనికి మించి ఆస్తులు సంపాదించారనే ఆరోపణలు ఉన్నాయి. అబ్దుల్లాపూర్ మెట్, పిగ్లీపురంలో 8 ఎకరాల భూమి కాజేసినట్లు తన మామ పేరుపై రిజిస్టేషన్ చేయించి రియల్టర్‌కు దారాదత్తం చేశాడు. ఓ రియల్టర్‌ నుంచి 10 ప్లాట్లు గిఫ్ట్‌ డీడ్‌ తీసుకున్నట్లు ఏసీబీ గుర్తించింది. వంశీ మోహన్‌పై వందల కోట్ల ఆస్తులు సంపాదించినట్లు సమాచారం. ప్రభుత్వ భూములు ప్రైవేటు వ్యక్తులకి దారదత్తం చేసిన ఆరోపణలపై అధికారులు సోదాలు చేపట్టినట్టు తెలుస్తోంది. 


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement